మార్కెట్ లో సూపర్ స్టార్ ఉన్నాడు అన్న బెరుకు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద బరిలో దూకిన శ్రీకాంత్ ఆపరేషన్ 2019తో గుట్టుచప్పుడు కాకుండా థియేటర్లలోకి అడుగు పెట్టాడు. పెద్దగా ప్రమోషన్ ఏది చేయని ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో 125వ సినిమా అంటూ కొంత హంగామా చేయడం తప్పించి ఇంకే ప్రచారం దక్కలేదు. తెలంగాణ ఎన్నికలు మరోవారంలో ఉన్న నేపధ్యంలో ఇంత హఠాత్తుగా విడుదల చేయడంతో శ్రీకాంత్ ని ఇప్పటికీ ఇష్టపడే అభిమానుల్లో ఎంతో కొంత అంచనాలు లేకపోలేదు.
ఇక విషయానికి వస్తే ఒక ఎన్ ఆర్ ఐ తాను పుట్టిన ఊరి కోసం చదివించి ఇంతవాడిని చేసిన ప్రజల కోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో కోటి రూపాయల డబ్బును లోకల్ ఎమెల్యేకు పంపుతాడు. తీరా అతను మోసం చేయడంతో అమెరికా నుంచి ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి మార్పు తీసుకురావాలని డిసైడ్ అవుతాడు. ఇక్కడికి వచ్చాక సవాళ్ళు అడ్డంకులు స్వాగతం పలుకుతాయి. వీటిని దాటుకుని హీరోను రాజకీయ చదరంగంలో ఎలా గెలిచాడు కోరుకున్న మంచి ఊరికి ఎలా చేసాడు అనేదే ఆపరేషన్ 2019.
అసలే అంతంతమాత్రంగా ఉన్న అంచనాలను కాపాడుకోవడంలో దర్శకుడు కరణం బాలాజీ ఫెయిల్ అయ్యాడు. సబ్జెక్టులో వెయిట్ ఉన్నప్పటికీ దాన్ని సరైన రీతిలో ప్రెజెంట్ చేయడంలో విఫలం కావడంతో కనెక్ట్ కావడం అటుంచి చివరిదాకా కూర్చోవడమే కష్టం అనేలా తీసాడు. పోస్టర్ల లో మంచు మనోజ్ ని శ్రీకాంత్ తో సమానంగా చూపించినప్పటికీ అతనిది కేవలం క్యామియోనే. అందులోనో ఓపికగా చూడాల్సిన స్లో మోషన్ ఫైట్ కావడం అసలు ట్విస్ట్. ఇక సునీల్ ని ఏదో పాటల కోసం వాడుకుంటే అదీ తేడా కొట్టింది.
శివాజీలోని రజనికాంత్ పాత్రను ఇన్స్ పైర్ అయ్యి ఇందులో శ్రీకాంత్ పోషించిన ఉదయ్ శంకర్ పాత్రను డిజైన్ చేసిన బాలాజీ క్లాస్ మాస్ కు మధ్యలో దాన్ని నలిపేసి శ్రీకాంత్ కు మర్చిపోవాల్సిన సినిమా ఇచ్చాడు. అప్పుడెప్పుడో ఆపరేషన్ దుర్యోధన అంటూ ఆకట్టుకున్న శ్రీకాంత్ అదే పోలికలున్న టైటిల్ తో ఈసారి హాల్ బయటికి పరుగులు పెట్టించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ అయితే జరిగింది కాని ఈసారి పేషంట్ తో పాటు డాక్టర్ కూడా హరీమన్నాడు