శ్రీకారం సెకండ్ సింగిల్ రిలీజ్.. 'సంక్రాంతి సందల్లే' అంటూ...

Update: 2021-01-04 12:50 GMT
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తుండటంతో హిట్లు లేక వెనకబడ్డాడనే చెప్పాలి. శతమానం భవతి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ మళ్లీ అలాంటి హిట్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత విడుదలైన రణరంగం, సమంతతో కలిసి రీమేక్ చేసిన జానూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. తమిళ సూపర్ హిట్ 96 సినిమాను తెలుగులో జానూ పేరుతో రీమేక్ చేశారు. దీంతో శర్వా తదుపరి సినిమా విషయంలో కాస్తా జాగ్రత్త పడుతున్నాడట. డెబ్యూ దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో, ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. శ్రీకారం సినిమా నుండి ఇదివరకే విడుదల చేసిన లిరికల్ సాంగ్ 'భలేగుంది బాలా' సోషల్ మీడియాలో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెంచల్ దాస్ లిరిక్స్ అందించి మరీ ఆలపించిన ఆ పాట ఇప్పటికి శర్వా అభిమానులకు మోస్ట్ ఫేవరేట్. ఇక శ్రీకారం నుండి తాజాగా మరో లిరికల్ సాంగ్ టీజర్ వదిలారు మేకర్స్. 'సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే..' అంటూ సాగే ఈ పాట తెలుగువారి సంక్రాంతి పండగను గుర్తు చేసేలా ఉంది. పాటలోనే సంక్రాంతి వైభవం అంతా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక మిక్కీ జె. మేయర్ అందించిన సంక్రాంతి బీట్ సినీ ప్రియులకు ఈజీగా చేరుతుంది. యంగ్ సెన్సేషన్ అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజ్ లు ఆలపించిన ఈ పాట మంచి ఉత్సాహం కలిగించేలా ఉంది. ఇక ఈ పూర్తి పాటను జనవరి 7న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Full View
Tags:    

Similar News