తంబీలకు తెలుగు భయం పట్టుకుంది

Update: 2015-07-25 06:33 GMT
నిన్నటివరకూ తమిళ తంబీలు మీసం మెలివేసి మేమే మహారాజులం అని విర్రవీగారు. టాలీవుడ్‌ ఎప్పటికీ మమ్మల్ని టచ్‌ కూడా చెయ్యలేదు అని సవాల్‌ విసిరేవారు. రజనీకాంత్‌, సూర్య, కమల్‌హాసన్‌, అజిత్‌, కార్తీ, ఆర్య, విజయ్‌.. ఇలా స్టార్‌ హీరోలంతా తెలుగు బాక్సాఫీస్‌ ని కొల్లగొట్టడానికి గాలం వేసేవారు. కానీ ఇప్పుడు సీను రివర్సులో వెళుతోంది.

ఇకనుంచి రొయ్య మీసం తిప్పితే కట్‌ చేయడానికి మనవాళ్లు సిద్ధంగా ఉన్నారు. అంతేనా మన సినిమాలు ఇట్నుంచి అటు వెళ్లి రిలీజవుతున్నాయంటే చాలు ఒణికిపోయే పరిస్థితి. తమిళ స్టార్‌ హీరోలు నటించిన సినిమాలకు ఇవన్నీ పెద్ద థ్రెట్‌ లా తయారయ్యాయి. బాహుబలి విసురు తో మొత్తం సీన్‌ రివర్సు లో ఉందిప్పుడు. మగధీర నుంచే ఆ హవా మొదలైంది. రాజమౌళి ఇచ్చిన పంచ్‌ మామూలుగా పడలేదక్కడ. ఆ సినిమాతో చరణ్‌ తమిళనాట కూడా మార్కెట్‌ పెంచుకున్నాడు. అతడి సినిమాలన్నీ అనువాదమై అక్కడ రిలీజవుతూ భారీ వసూళ్లను తెస్తున్నాయి.

ఇటీవలే లీగ్‌ లోకి బన్నీ కూడా చేరాడు. మలయాళం తో పాటు తమిళంపై కూడా ఫోకస్‌ చేస్తున్నాడు. ఇక ఎలాగూ మహేష్‌ ఛరిష్మా ముందు తమిళ పరిశ్రమ ఒంగి సలామ్‌ కొట్టింది. శ్రీమంతుడు తమిళ వెర్షన్‌ సెల్వంధన్‌ పేరు తో భారీగా రిలీజవుతోంది. రిలీజ్‌ ముందే అక్కడ ప్రిన్స్‌ సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. మార్కెట్లో విసురుగా వెళ్తున్నాడు. అసలు బాహుబలి తో ప్రభాస్‌, రానాల రేంజేంటో అక్కడివారికి అర్థమైంది. ఈ ఇద్దరూ నటించే సినిమాలకు ఇక అక్కడ తిరుగుండదు. ప్రతి సినిమాని అనువదించి రిలీజ్‌ చేసుకోవచ్చు. ఏ కోణంలో చూసినా తెలుగు సినిమాని తక్కువ చేసి చూసిన తంబీలకు ఇప్పుడు సిసలైన సవాల్‌ ఎదురవుతోంది.

పండగలు, పబ్బాల వేళైనా తెలుగు సినిమాని ఆపండయ్యా, పోటీ తట్టుకోలేకపోతున్నాం అంటూ అక్కడ స్థానిక నిర్మాతలు, బయ్యర్లు, పంపిణీదారులు హడలెత్తిపోతున్నారు. శంకర్‌ రికార్డుల్ని రాజమౌళి కొట్టేశాడు. రజనీకాంత్‌, సూర్య, విక్రమ్‌ రికార్డుల్ని ప్రభాస్‌, మహేష్‌ చెరిపేసేట్టున్నాడు. అందుకే వాళ్ళు టెన్షన్‌ పడుతున్నారు.
Tags:    

Similar News