ఒకప్పుడు డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ పెద్ద సంచలనం. ఆ సిస్టమ్ అమర్చుకున్న థియేటర్ల గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆ తర్వాత డాల్బీ సౌండ్ సిస్టమ్ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు డాల్బీ అట్మాస్ గురించి సినీ పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది. మూడేళ్ల కిందటే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. బాహుబలి సినిమాతో దానికి మంచి పబ్లిసిటీ వచ్చింది. ప్రేక్షకులు ఈ టెక్నాలజీ అందిపుచ్చుకున్న థియేటర్ల లో బాహుబలి చూడ్డానికి బాగా ఆసక్తి చూపించడంతో మిగతా థియేటర్ల యజమానులు ఆలోచలనలో పడ్డారు. మూవీ మేకర్స్ కూడా ఇకపై ఈ టెక్నాలజీతోనే సినిమాలు రూపొందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే కిక్-2 కూడా డాల్బీ అట్మాస్ టెక్నాలజీని అందిపుచ్చుకోగా.. తాజాగా ‘శ్రీమంతుడు’ కూడా బాహుబలి బాటలోనే సాగుతున్నాడు. ఆగస్టు 7న విడుదల కాబోతున్న ఈ సినిమాను డాల్బీ అట్మాస్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. బాహుబలి విడుదల సందర్భంగా చాలా మల్టీ ప్లెక్స్ లతో పాటు సింగిల్ స్క్రీన్స్ సైతం డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ని అమర్చుకున్నాయి. ఇప్పుడు శ్రీమంతుడు రిలీజ్ నేపథ్యంలో మరిన్ని స్క్రీన్స్ లో డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉపయోగించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలవగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేసినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అతడి పనితనం డాల్బీ అట్మాస్ లో మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అంటున్నారు.