నితిన్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో రూపొందిన శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ ఇప్పుడే విడుదలైంది. ముందు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేకమైన అంచనాలు కలిగిన ఈ సినిమాపై ట్రేడ్ లో కూడా మంచి బజ్ ఉంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సింపుల్ లవ్ ప్లస్ మ్యారేజ్ స్టోరీగా రూపొందిన శ్రీనివాస కళ్యాణంలో అన్నింటి కన్నా ఎక్కువ హై లైట్ అయ్యింది మాత్రం తెరనిండుగా ఉన్న తారాగణం.
ఆధునిక భావాలు ఉన్న సంపన్న కుటుంబం ప్రకాష్ రాజ్ ది. అతని కూతురే రాశి ఖన్నా. ఉమ్మడి కుటుంబం బంధువులతో కళకళలాడే కుటుంబం రాజేంద్ర ప్రసాద్ ది. ఇతని గారాల పుత్రుడే నితిన్.ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. పెళ్లి పీటల దాకా వెళ్తుంది. ప్రకాష్ రాజ్ ముందు సంశయించినా తర్వాత ఓకే చెబుతాడు. ఇక పెళ్లి సందడి మొదలు. జనంతో పెళ్లి పందిరి కళకళలాడటం వచ్చి పోయే వాళ్ళు దూరమైన వాళ్ళు మళ్ళి కలుసుకోవడం పలకరింపులు అలకలు సరదాలు సంతోషాలు ఇలా అంతా ఓ పెళ్లి వేడుకలాగా చూపించారు సినిమాను.
కీలకమైన ట్విస్ట్ ఏది రివీల్ కాకుండా జాగ్రత్త పడింది టీమ్. ట్రైలర్ ఫ్లాట్ గా ఎలాంటి కుదుపులు లేకుండా తీసిన ప్రేమ కథగా చూపించారు కానీ సినిమా కూడా మరీ ఇంత ప్లెయిన్ గా ఉంటే ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఆశించినట్టే తప్ప మరీ చాలా ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో చూడలేదే అనే రేంజ్ లో మాత్రం శ్రీనివాస కళ్యాణం ఉందని చెప్పలేం. ఇప్పటికే బాగా పాపులర్ అయిన టైటిల్ సాంగ్ తోనే థీమ్ మ్యూజిక్ ఉండగా మిక్కీ జె మేయర్ ఆడియో ఆల్రెడీ టాప్ బస్టర్ గా ఉంది,సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఆహ్లదకరంగా ఉంది. అంచనాలు అమాంతం ఎగబాకేలా లేకపోయినా శ్రీనివాస కళ్యాణం నేపథ్యం మాత్రంతెరమీద నిండైన ఫామిలీస్ తో సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా ఉంది. ఆగస్ట్ 9న విడుదల కానున్న శ్రీనివాస కళ్యాణంని భారీ ఎత్తున విడుదల చేసేందుకు దిల్ రాజు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.
Full View