వరుణ్ తేజ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ మిస్టర్. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ చేసేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ అటక ఎక్కేసిందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో వైట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
వైట్ల చెప్పిన స్టోరీ కంటే శేఖర్ కమ్ముల చెప్పిన లైన్ కే వరుణ్ తేజ్ మొగ్గు చూపుతున్నాడని.. ఆ ప్రాజెక్ట్ కోసం వైట్ల సినిమాను ఆపేయాలని అనుకుంటున్నాడని మీడియా టాక్. కనీసం తమ వెర్షన్ కూడా ఏంటో తెలుసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారని.. మిస్టర్ రైటింగ్ బృందంలో ముఖ్యుడైన గోపీ మోహన్ అంటున్నాడు. పైగా శ్రీధర్ సీపాన ఇప్పటికడైలాగ్ వర్షన్ కూడా కంప్లీట్ చేసి ఉంచాడని తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. జూన్ రెండో వారంలో తిరిగి ఇండియాకి వచ్చాక.. ప్రాజెక్టుపై మరింత క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే వైట్ల మాత్రం ఈ విషయంలో మీడియా కావాలనే తనపై బురద చల్లుతోందని భావిస్తున్నాడట. అందుకే గోపీ మోహన్ తో సీరియస్ గా లెటర్ రాయించాడని తెలుస్తోంది.