ఒకప్పుడు వరుస హిట్లతో ఒక వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల. ఐతే ‘ఆగడు’తో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. ఆ సినిమా ఊహించని విధంగా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ దెబ్బ సరిపోదని ‘బ్రూస్ లీ’ కూడా డిజాస్టరే అయింది. వరుసగా ఇద్దరు స్టార్ హీరోలతో డిజాస్టర్లు తీసేసరికి చాలా చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు వైట్ల. వేరే స్టార్ డైరెక్టర్లు వైట్ల కంటే ఎక్కువ ఫ్లాపులు తీసినప్పటికీ అతడికొచ్చినంత చెడ్డ పేరు రాలేదు. ఇందుక్కారణం అతను ఒకే ఫార్ములాను పట్టుకుని వేలాడటమే. ఐతే ఈ రెండు డిజాస్టర్లతో తాను పాఠాలు నేర్చుకున్నానని అంటున్నాడు వైట్ల. ఈ సినిమాలు తనకు ఒక రకంగా మంచే చేశాయని అంటున్నాడతను.
‘‘నేను అలాంటి సినిమాలు తీయాల్సింది కాదు. కానీ నేను తీసిన ఫ్లాపులు నాకు మంచే చేశాయి. నేను రొటీన్ బాటను వీడి కొత్తగా ఆలోచించేలా చేశాయి. ఈ సినిమాల తర్వాత నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇక నేను రొటీన్.. ఫార్ములా సినిమాలు చేయను’’ అని వైట్ల అన్నాడు. ఇప్పుడు తన దర్శకత్వంలో వస్తున్న ‘మిస్టర్’ హిట్ కోసం డెస్పరేషన్లో చేసిన సినిమా కాదని.. ప్రేక్షకుల మీద ప్రేమతో చేసిందని వైట్ల అన్న సంగతి తెలిసిందే. ‘మిస్టర్’ కథను 2015 చివర్లో గోపీమోహన్ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించిందని.. ఈ సినిమా తీయడానికి చాలా ఎగ్జైట్ అయ్యానని.. ఇదొక ఫ్రెష్ లవ్ స్టోరీ అని అన్నాడు వైట్ల. సినిమా చాలా బాగా వచ్చిందని.. ఇది కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని వైట్ల అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/