మహేష్ రెండు నెలలు.. వైట్ల మూడు రోజులే

Update: 2015-10-12 19:30 GMT
ఓ సినిమా ఫెయిల్యూర్‌ కు సాధారణంగా దర్శకుడే బాధ్యుడు. సినిమా ఫలితం తాలూకు నష్టం కూడా నిర్మాత తర్వాత ఎక్కువ అనుభవించేది దర్శకుడే. కాబట్టి సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎక్కువ బాధ పడాల్సింది దర్శకుడే. కానీ ‘ఆగడు’ సినిమా విషయంలో మాత్రం దర్శకుడు శ్రీను వైట్ల మాత్రం మరీ ఎక్కువగా ఏమీ బాధ పడలేదట. మూడు రోజులు మాత్రం బాధపడ్డానని.. నాలుగో రోజు నుంచే చరణ్ తో చేయాల్సిన సినిమా పనిలో పడిపోయానని అన్నాడు వైట్ల.

ఐతే ఇక్కడ ఓ విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. ‘ఆగడు’ ఫెయిల్యూర్ తర్వాత మహేష్ రెండు నెలల పాటు ఇంటి నుంచి బయటికి కూడా రాకుండా విపరీతంగా బాధపడినట్లు చెప్పుకున్నాడు ఓ ఇంటర్వ్యూలో. ఆ ఫెయిల్యూర్ వల్ల మహేష్ కు ప్రత్యేకంగా వచ్చిన నష్టమేమీ లేదు. అయినప్పటికీ అంతగా బాధపడ్డాడు ప్రిన్స్. తన జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్ ‘ఆగడు’ సినిమానే అని కూడా చెప్పుకున్నాడు మహేష్. మరి ప్రిన్స్ అంత బాధపడితే.. వైట్ల మాత్రం ‘ఆగడు’ ఫెయిల్యూర్ని లైట్ తీసుకోవడం విశేషమే.

ఓ సినిమా ఫెయిలైతే దాన్నే తలుచుకుని బాధపడాల్సిన పనేమీ లేదు. కానీ తమ హీరోను అంతగా బాధపెట్టిన సినిమా విషయంలో వైట్ల ఇంత లైట్ తీసుకోవడం.. ఫెయిల్యూర్ గురించి తేలిగ్గా మాట్లాడటం మహేష్ అభిమానులకు కొంచెం కాక తెప్పించేదే. అయినా వైట్ల ఎవరో ఏదో అనుకుంటారని ఫీలయ్యే టైపు కాదు కదా.
Tags:    

Similar News