త‌ప్పులపై వైట్ల‌ ప‌శ్చాత్తాపం!?

Update: 2018-11-13 07:38 GMT
వ‌రుస బ్లాక్‌ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన శ్రీ‌నువైట్ల కెరీర్ అనూహ్యంగా వ‌రుస ఫ్లాప్‌ ల‌తో డైలెమాలోకి వెళ్లిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ స‌న్నివేశం నుంచి అత‌డిని బ‌య‌ట ప‌డేసేందుకు జాన్ జిగిరీ దోస్త్ ర‌వితేజ లిఫ్టిచ్చారు. ఈ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమానే `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`. ఈనెల 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సినిమా శ్రీ‌నూకి - ర‌వితేజ‌కు ఎంతో ఇంపార్టెంట్. ఇలాంటి టైమ్‌ లో వైట్ల‌కు మీడియా నుంచి ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. వ‌రుస వైఫ‌ల్యాల వ‌ల్ల నెర్వ‌స్‌ గా ఉన్నారా? అంటూ మొద‌టి ప్ర‌శ్న‌తోనే మీడియా ఎటాక్ చేయ‌డంతో ఒక్క‌సారిగా షాక్ తిన్న వైట్ల .. త‌న‌దైన శైలిలో న‌వ్వేస్తూ .. నెగెటివ్ ప్ర‌శ్న‌తోనే మొద‌లెట్టారా? అంటూ ఆన్స‌ర్ మొద‌లెట్టారు.

కాన్ఫిడెన్స్‌ తో ఉన్న‌ప్పుడే రిలాక్స్‌ డ్‌ గా ఉంటాం.. అంటూనే.. త‌ప్పుల నుంచే ఎక్కువ నేర్చుకుంటామ‌ని అన్నారు. ఫ్లాపులు నిజ‌మే.. అయితే వాటి నుంచి నేర్చుకోవ‌డం అవ‌స‌రం. లేదొంటే అక్క‌డే ఉంటాం. నేను రియ‌లైజ్ అయ్యాను. రియ‌లైజ్ అయ్యాన‌నే అనుకుంటున్నా. నేను పీక్‌ లో ఉన్న‌ప్పుడు ఎలా ప‌ని చేశానో అలానే ఇక‌పైనా సినిమాలు చేయాల‌నుకున్నా. ఏఏఏ క‌థ అనుకుని ర‌వితేజ‌కు వినిపించ‌డం.. త‌ను ఎగ్జ‌యిట్ అవ్వ‌డం.. ఆ వెంట‌నే మైత్రితో క‌లిసి సెట్స్‌ కెళ్లిపోవ‌డం ఇదంతా ఓ ప్రాసెస్‌ లా సాగిందని తెలిపారు.

నేను- ర‌వితేజ క‌లిసి సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు మైత్రి వాళ్లు ఓకే చేశారు. వాళ్ల‌కంటే ముందు వేరే ఐదారుగురు నిర్మాత‌లు ఉన్నా.. వీళ్ల‌తో చేయ‌డ‌మే నాకు ఇష్టం. మైత్రితో అంత స్నేహం ఉంది. ఈ బ్యాన‌ర్‌ లో సినిమా చేయ‌డం వ‌ల్ల‌నే ఇంత సులువుగా ప్ర‌యాణం సాగింది. మొత్తం షూటింగ్ అమెరికాలో భారీ  కాస్ట్ & క్రూ తో అమెరికాలో చేయాల్సి వ‌చ్చింది. అది క‌థ డిమాండ్ మేర‌కే. మైత్రి సంస్థ‌ స‌పోర్టుతోనే ఇది విజ‌య‌వంతంగా చేయ‌గ‌ల‌గాను. ఆర్టిస్టుల సాయం.. సాంకేతిక నిపుణుల సాయంతోనే ఇంత బాగా ప్ర‌యాణం చేయ‌గ‌లిగాను.. అని షూటింగ్ అనుభ‌వం వివ‌రించారు.  నేను చాలా ల‌గ్జ‌రీగా చేసిన సినిమా ఇది. నా నిర్మాత‌ల సంస్కారం అంత గొప్ప‌ది. నేను చెప్పిన దానికి క్వాలిటీ పెట్టుబ‌డి పెట్టారు నా నిర్మాత‌లు. మైత్రి నిర్మాత‌లు ఎంతో మంచి వాళ్లు కాబ‌ట్టే ఇది సాధ్య‌మైంది. వాళ్లు బ‌డ్జెట్ ఇచ్చారు క‌దా.. అని దానిని ఎంతైనా పెంచే త‌ప్పు నేను చేయ‌లేదు.. అవ‌స‌ర‌మైనంత‌ బ‌డ్జెట్‌ లోనే చేయ‌గ‌లిగాం.. అని అన్నారు. నా బ్లాక్‌ బ‌స్ట‌ర్లు వెంకీ - దుబాయ్ శ్రీ‌ను ని మించి `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`లో క‌థ ఉంటుంది. మంచి క‌థ ఉంటుంది.. అని తెలిపారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో నాకు కుదిరిన‌ట్టు ఇంకెవ‌రికీ కుద‌ర‌దు. త‌ను ఎప్ప‌టినుంచో స్నేహితుడు. వెంకీ టైమ్‌ లో ఫ్లాపులో ఉన్న నాకు ఎన‌ర్జీ నిచ్చి  సినిమా ఇచ్చి లైఫ్‌ నిచ్చాడు. మ‌ళ్లీ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` టైమ్‌ లోనూ క‌థ గురించి అడిగాడే కానీ ఇంకేదీ నాతో మ‌ట్లాడ‌లేదు అని వైట్ల తెలిపారు. త‌దుప‌రి ఇంకా ఏ ప్రాజెక్టుకు సంత‌కం చేయ‌లేద‌ని వెల్ల‌డించారు.


Tags:    

Similar News