వైట్ల సార్.. టెక్నాలజీ కాదు కంటెంట్ కావాలి

Update: 2018-06-02 07:42 GMT
టాలీవుడ్ లో విజయం కోసం ఎక్కువ ఆశలు పెట్టుకున్న దర్శకుల్లో ప్రస్తుతం శ్రీను వైట్ల టాప్ లో ఉన్నాడు. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ దర్శకుడు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్ మహారాజాతో చేతులు కలిపాడు. మరో వైపు రవితేజ కూడా మళ్లీ పాత పద్దతిలోనే డిజాస్టర్ అందుకుంటున్నాడు. అయితే శ్రీను వైట్ల కంటెంట్ కంటే ఎక్కువగా విజువల్స్ పై ద్రుష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

అమర్ అక్బర్ అంథోని అనే ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అయితే దర్శకుడు సినిమాలో ప్రతి సీన్ అద్భుతంగా కనిపించడానికి కొత్త తరహా టెక్నాలిజీని వాడుతున్నారట. కెమెరా లెన్స్ విషయంలో చాలా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ నుంచి అద్భుతమైన టెక్నాలిజీని రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ఎంత టెక్నాలిజీ వాడినా కూడా కంటెంట్ లో మ్యాటర్ ఉండాలి.

అది చాలా సార్లు రుజువయ్యింది. హాలీవుడ్ సినిమాలే బొక్కబోర్లా పడ్డాయి. బాలీవుడ్ కూడా ఆ రూట్ లో వెళ్లడం మానేసింది. మన దర్శకులు కూడా అవసరం అయితే గాని టెక్నాలిజీ పరంగా నిర్మాతలతో ఖర్చు చేయించడం లేదు. ఇక ఇప్పుడు ఫ్లాప్ లో ఉన్న శ్రీను వైట్ల ఏ విధంగా ఆలోచిస్తూ చేస్తున్నాడో గాని మ్యాటర్ లేకుంటే ఎంత కొత్త టెక్నాలిజీ వాడినా వేస్ట్ అని.. అది తెలిస్తే బావుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ దర్శకుడు హిట్టు కొడతాడో లేదో చూడాలి.  


Tags:    

Similar News