కాస్టింగ్ కౌచ్ ఫైట్: నందిని vs శ్రీరెడ్డి

Update: 2020-05-26 13:08 GMT
కాస్టింగ్ కౌచ్. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు, నటీమనులపై సినీ ప్రముఖల లైంగిక వేధింపులపై పెద్ద ఉద్యమమే జరిగింది. అవకాశాల కోసం ఎంతో మంది వారి లైంగిక అవసరాలు తీర్చారనే విషయం వెలుగుచూసింది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ దందా బయటపడింది. టాలీవుడ్ లో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.

ఈ సందర్భంగా ఇదే కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ నవతరం హీరోయిన్ నందినిరాయ్ స్పందించింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ తాజాగా ‘హలో’యాప్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో మాట్లాడింది. ‘కాస్టింగ్ కౌచ్ లో అడిగే వాళ్లు అడుగుతారని.. అంతా అమ్మాయి ఇష్టమేనని చెప్పుకొచ్చింది. ఒక అమ్మాయి ఆ పనికి వెళ్లాలనుకుంటే వెళ్తుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే నో చెప్తుందని.. ఎవరు ఎవరినీ ఫోర్స్ చేయరని.. తాను కళ్లతో చూశాను కాబట్టి చెబుతున్నానని’ నందినీరాయ్ హాట్ కామెంట్స్ చేశారు.

నందినీరాయ్ కామెంట్స్ టాలీవుడ్ లో సంచలనమయ్యాయి. దీనిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో స్పందించింది. ‘సెక్స్ కావాలని అడిగితే అది కాస్టింగ్ కౌచ్. కానీ మనమే డైరెక్ట్ గా ఆఫర్ చేస్తే అది కాస్టింగ్ కౌచ్ కాదు.. నీ గురించి నాకు బాగా తెలుసు.. నువ్వు నా స్నేహితురాలివి.. అది మరిచిపోకు బుజ్జి’ అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. ఇది వైరల్ గా మారింది.
Tags:    

Similar News