యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మొదలు ఎప్పుడు కూడా తండ్రి పేరును వినియోగించుకునే ప్రయత్నం చేయలేదు. ఆయనను వాడుకుని ఆఫర్లు దక్కించుకోలేదు.. ఆయన పేరు చెప్పుకుని పారితోషికం వసూళ్లు చేసింది లేదు అనేది అందరికీ తెలిసిందే.
కేవలం నటిగా మాత్రమే కాకుండా శృతి హాసన్ మల్టీ ట్యాలెంటెడ్ అంటూ ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది. మ్యూజిక్ కంపోజ్ చేయడం తో పాటు మంచి గాయినిగా కూడా శృతి హాసన్ మెప్పించింది. విదేశాల్లో శృతి హాసన్ స్టేజ్ షో ల్లో కూడా పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
కాస్ట్యూమ్స్ డిజైనింగ్ తో పాటు ప్రొడక్షన్ వర్క్ లో కూడా గతంలో పలు సినిమాలకు శృతి హాసన్ వర్క్ చేసింది. ఇప్పుడు ఆమె దృష్టి స్క్రిప్ట్ రైటింగ్ పై పడిందట. ఆ విషయాన్ని స్వయంగా శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆకట్టుకునే అందం ఈమె సొంతం... వరుస సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉంటాయి.. అయినా కూడా కొత్తగా ప్రయత్నించడం కోసం శృతి పరితపిస్తూ ఉంటుంది.
స్క్రిప్ట్ రైటింగ్ మొదలు పెట్టి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయాలని.. కొత్త జర్నీ మొదలు పెట్టాలని చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లుగా శృతి హాసన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్క్రిప్ట్ రైటింగ్ తర్వాత డైరెక్షన్ ను కూడా శృతి హాసన్ మొదలు పెడుతుందేమో చూడాలి.
హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు వస్తున్న ఈ సమయంలో కూడా శృతి హాసన్ ఇలా వేరు వేరు వ్యాపకాలను పెంచుకోవడం కేవలం ఈమెకు మాత్రమే సాధ్యం అయ్యింది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొన్న సంక్రాంతికి చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో... బాలయ్య తో కలిసి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సలార్ తో పాటు పలు సినిమాల్లో శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. శృతి హాసన్ స్క్రిప్ట్ తో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.