ఆ విషయంలో ఎన్టీఆర్‌.. ప్రభాస్ సేమ్ టు సేమ్‌

Update: 2021-12-28 05:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రతి రోజు మీడియా ముందుకు వస్తున్నాడు. సినిమా మేకింగ్‌ సమయంలో మీడియా ముందుకు కాదు కదా కనీసం సోషల్‌ మీడియాలో కూడా కనిపించడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తూ సినిమాకు సంబంధించిన విషయాలను వెళ్లడించడంతో పాటు ఇతర విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాజమౌళి ఏం మాట్లాడినా కూడా సెన్షేషన్‌ అనడంలో సందేహం లేదు. తక్కువ మాట్లాడే రాజమౌళి ప్రతి విషయంలో కూడా పూర్తి అవగాహణతో మాట్లాడుతాడు. అందుకే ఆయన స్పీచ్ లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఏదైనా వేడుకల్లో ఆయన మాట్లాడితే వినాలని అంతా ఎదురు చూస్తూ ఉంటారు.

తాజాగా చెన్నైలో జరిగిన ఆర్ ఆర్‌ ఆర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిని కదిలిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. ఇక ఇద్దరు హీరోలతో తన వర్క్‌ ఎక్స్ పీరియన్స్ ను గురించి రాజమౌళి చెప్పుకొచ్చాడు. గతంలో తాను బాహుబలి ని చేసిన ప్రభాస్‌ గురించి కూడా తాజాగా రాజమౌళి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక విషయంలో రాజమౌళి మరియు ఎన్టీఆర్‌ లకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఫుడ్‌ విషయంలో వారిద్దరు కూడా సేమ్‌ టు సేమ్‌ అంటూ రాజమౌళి కామెంట్స్ చేశాడు.

ప్రభాస్ కు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం అనే విషయం అందరికి తెల్సిందే. తాను తినడమే కాకుండా తన తో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభాస్‌ తినిపిస్తూ ఉంటాడు. తాను ఏ సినిమాలో నటించినా ఆ సినిమా యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఏదో ఒక సందర్బంలో ప్రభాస్ ఫుడ్ తినాల్సిందే అనడంలో సందేహం లేదు. అదే తరహాలో ఎన్టీఆర్ కూడా ఆహారంను ఎంతగానో ఆస్వాదిస్తాడట. ప్రభాస్ తరహాలోనే ఎన్టీఆర్‌ కు కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఫుడ్స్‌ ను ట్రై చేస్తూ ఉంటాడట. ఎన్టీఆర్‌ తినడం మాత్రమే కాకుండా వండటం కూడా బాగా తెలిసిన వ్యక్తి అన్నట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇంకా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ షూటింగ్‌ సమయంలో అందరి కంటే ముందు సెట్స్ కు ఎన్టీఆర్ వచ్చే వాడు అంటూ రాజమౌళి పేర్కొన్నాడు. జనవరి 7వ తారీకున భారీ ఎత్తున అంచనాల నడుమ సంక్రాంతికి వారం ముందే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల కాబోతుంది.
Tags:    

Similar News