'వకీల్ సాబ్' థియేటర్లో మీకు కళ్లార్పే టైముండదు: తమన్

Update: 2021-04-05 06:30 GMT
టాలీవుడ్ సంగీత దర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ తరువాత ఎక్కువగా వినిపించే పేరు తమన్. ఈ మధ్య కాలంలో ఆయన స్వరపరిచిన బాణీలు ఆయా సినిమాల విజయంలో కీలకమైన పాత్రలను పోషించాయి. తాజాగా ఆయన 'వకీల్ సాబ్' సినిమాకి బాణీలను అందించారు. నిన్నరాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. "ఈ సినిమా కోసం చేసిన 'మగువ' సాంగ్ ను నేను నా తల్లికి అంకితం చేస్తున్నాను. ఆమె నన్ను ఎన్నో కష్టాలు పడి పెంచింది. ఆమె కారణంగానే ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నాను.

సాధారణంగా నేను ఎక్కువగా మాట్లాడను .. కానీ పవన్ గారు ఎదురుగా కూర్చుని ఉంటే మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. 'మగువ' సాంగ్ కి క్లాసికల్ టచ్ ఇస్తూ మూడు రోజుల్లో లైవ్ లో రికార్డు చేశాము .. కీ బోర్డు వాద్యాలు ఏమీ వాడలేదు. ఈ పాట కోసం ఒరిజినల్ గా పనిచేసిన వాళ్లనే స్టేజ్ పైకి తీసుకొచ్చాను. ఈ పాట వింటే వీళ్లంతా ఎంత టాలెంటెడ్ అనేది మీకు అర్థమవుతుంది. వీళ్లంతా కూడా పవన్ కల్యాణ్ గారి పట్ల గల ప్రేమతో వర్క్ చేసినవారే.

'మగువ' సాంగ్ రిలీజై చాలాకాలమైపోయింది. 'ఉమెన్స్ డే'కి  అంతటా ఆ సాంగ్ తో సెలబ్రేషన్స్ జరగడంతో, ఆ సాంగ్ జనంలోకి ఎంతగా వెళ్లిందనేది మాకు అర్థమైంది. ఆ పాటకి క్లాసికల్ వెర్షన్ ఒకటి ట్రై చేశాము. ఈ సినిమా పాటలపై కసరత్తుతో మేము సరిగ్గా నిద్రపోక 36 రోజులైంది. ఈ సినిమాను అందరూ చూడాలి .. ఒక్కరూ కూడా మిస్ కావొద్దు. థియేటర్లో మీకు కళ్లార్పే టైముండదని మీకు నమ్మకంగా చెప్పగలను. 'వకీల్ సాబ్' కోసం ఐటమ్ సాంగ్ ఏమైనా ఉంటే ఇవ్వు భయ్యా అని అభిమానులు అడిగారు. మళ్లీ చెబుతున్నాను ఈ సినిమాలో సిగరెట్లు వెలిగించుకునే పాటలు ఉండవు .. ఇళ్లలో దీపాలు వెలిగించుకునే పాటలు ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు.      
Tags:    

Similar News