పాన్ ఇండియా ముందే SSMB 28 సంచ‌ల‌నం!

Update: 2022-05-31 04:29 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.  'భ‌ర‌త్ అనే నేను'..'మ‌హ‌ర్షి'..'స‌రిలేరు నీకెవ్వ‌రు' వ‌రుస‌గా నాలుగు బ్లాక్ బ‌స్టర్లు ఖాతాలో వేసుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో మ‌హేష్  ఇమేజ్ రెట్టింపు అయింది. మరో రెండు స‌క్సెస్ లు ఖాతాలో జ‌మ అయితే డ‌బుల్ హ్యాట్రిక్ స్టార్ గా అవ‌త‌రిస్తారు. మహేష్ ప్లానింగ్ సైతం అదే విధంగా క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం మ‌హేష్ లాక్ చేసిన ద‌ర్శ‌కుల స‌క్సెస్ రేట్ చూస్తే ఆ విష‌యం స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది. 28వ చిత్రం కోసం త్రివిక్ర‌మ్ తో జ‌త క‌డుతున్నారు. ఇక 29వ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించ‌నున్నారు. ద‌ర్శ‌క శిఖ‌రం రాజ‌మౌళి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో ఎస్ ఎస్ ఎంబీ 29ని ప్లాన్ చేస్తున్నారు.

స‌క్సెస్  ఫుల్ మేక‌ర్ ఖాతాలో ఎస్ ఎస్ ఎంబీ హిట్ అని ముందే రాసిపెట్టుకోవ‌చ్చు. కంటెంట్ ప‌రంగా..మేకింగ్ ప‌రంగా 29వ చిత్రం హైలైట్స్ గురించి ముందే అంచ‌నా వేయోచ్చు. అయితే మ‌హేష్ పాన్ ఇండియా ఎంట్రీకి ముందు 28వ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌న్న‌ది ఫ్యాన్స్ మాట‌.

మ‌రి ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు నెల‌కొన్నాయి?  మాట‌ల మాంత్రికుడు ఎలాంటి కంటెంట్ తో వ‌చ్చే అవ‌కాశం ఉంది? 'అత‌డు' త‌ర‌హాలో మ‌రో స‌క్సెస్ ని మ‌హేష్ కి ఇవ్వ‌గ‌ల‌రా?  పాన్ ఇండియా ముందు మ‌హేష్ ఇమేజ్ విష‌యంలో కంటెంట్ ప‌రంగా ఎలాంటి జాగ్ర‌త్త‌ల‌కు ఆస్కారం ఉంది? ఇలా ఎన్నో సందేహాలు ఇప్పుడు అభిమానుల బుర్ర‌ల్ని తొలిచేస్తున్నాయి.

ఓసారి ఇద్ద‌రి పాస్ట్ చిత్రాల్లోకి వెళ్తే...మ‌హేష్ వ‌రుసగా ప్లాప్ ల్లో ఉన్న స‌మ‌యం. 'ఒక్క‌డు' త‌ర్వాత స‌రైన స‌క్సెస్ ద‌క్క‌ని త‌రుణం అది. అదే స‌మ‌యంలో 'అత‌డు'తో మ‌హేష్ కి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చారు త్రివిక్ర‌మ్. ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ కి అది రెండ‌వ చిత్రం. నేర చ‌రిత్ర గ‌లిగిన మ‌హేష్ పాత్ర‌ని తెర‌పై స్టైలిష్ గా ఆవిష్క‌రించిన వైనం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. స‌మ పాళ్ల‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ ని మేళ‌వించి క‌మ‌ర్శియ‌ల్ పంథాలో తెర‌కెక్కిన సినిమా విజ‌యంతో మ‌హేష్ రేంజ్ ఒక్క‌సారిగా మారింది. మార్కెట్ లో మ‌హ‌ష్ ఇమేజ్ రెట్టింపు  అయింది.

ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ పేరు మారుమ్రోగిపోయింది. ఆ కాన్పిడెన్స్ తోనే మ‌ళ్లీ ఐదేళ్ల గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ 'ఖ‌లేజా'తో చేతులు క‌లిపారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరమైన ఫ‌లితాన్ని చ‌వి చూసింది. వెండి  తెర‌పై మ‌హేష్ ని ఆవిష్క‌రించిన  విధానానికి తీవ్ర విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది.  'అత‌డు' విజ‌యంతో ప్ర‌శంస‌లందుకుంటే..'ఖ‌లేజా' ప‌రాయంతో  విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు.  

ఆ దెబ్బ‌కి త్రివిక్ర‌మ్ అంటేనే మ‌హేష్ ఒణికే ప‌రిస్థితి ఎదురైంది. దీంతో మ‌హేష్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ వైపు చూడ‌టానికి ఏకంగా 12 ఏళ్లు ప‌ట్టింది.  ఈ నేప‌థ్యంలో మ‌హేష్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాల్సిన బాధ్య‌త త్రివిక్ర‌మ్ పై ఎంతైనా ఉంది. ఇప్పుడు మ‌హ‌ష్ రేంజ్ అంత‌కంత‌కు పెరిగిపోయింది. అత‌ని సినిమాలు సునాస‌యంగా 150-200 కోట్ల వ‌సూళ్ల‌ని కొల్ల‌గొడుతున్నాయి. యువ మేక‌ర్ల‌తోనే మ‌హేష్ ఆ ఫీట్ ని సునాయాసంగా  సాధించ‌గ‌ల్గుతున్నారు.

ఈనేప‌థ్యంలో మ‌హ‌ష్ తో త్రివిక్ర‌మ్  అంత‌కు మించిన కంటెంట్ తో సినిమా తీయాలి. మ‌హేష్ ఇమేజ్ ని 28వ చిత్రం పెచేలా ఉండాలి. పాన్ ఇండియా రిలీజ్ ముందు ఎస్ ఎస్ ఎంబీ 28 సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేయాలి. మ‌హేష్ గ‌త సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాయ‌గ‌ల‌గాలి.

300 కోట్ల వ‌సూళ్ల చిత్రాన్ని మ‌హేష్ కి మాంత్రికుడు ఇవ్వ‌గ‌లగాలి. అప్పుడే మ‌హేష్ న‌మ్మ‌కం నిల‌బ‌డిన‌ట్లు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ స‌క్సెస్ రేట్ కూడా బాగుంది. అత‌ను తెర‌కెక్కించిన గ‌త రెండు చిత్రాలు అర‌వింద స‌మేత 160 కోట్లు..అల‌వైకుంఠ పుర‌ములో 250 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ని సాధించాయి. ఈ నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ పై భారీ అంచ‌నాలే  నెల‌కొంటున్నాయి. మ‌రి మ‌హేష్- త్రివిక్ర‌మ్ బాక్సాఫీస్ వ‌ద్ద  ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూద్దాం.
Tags:    

Similar News