సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రీతో కలిసి 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మథ్య మే 12న మహేష్ అభిమానులకు సమ్మర్ కానుకగా విడుదలైన ఈ మూవీ తొలి రోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుని ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. అయితే కలెక్షన్ ల పరంగా మాత్రం ఫరవాలేదనిపించింది.
ఈ నేపథ్యంలో మహేష్ - త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు పన్నెండేళ్ల విరామం తరువాత వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా కావడంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతీదీ స్పెషల్ గా వుండాలని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల 'సర్కారు వారి పాట' రిలీజ్ తరువాత ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ మహేష్ ఇటలీకి వెకేషన్ కి వెళ్లారు. అక్కడే ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నారు.
ఈ మూవీ స్క్రిప్ట్ లో ఫైనల్ కరెక్షన్స్ పూర్తి కావడంతో త్రివిక్రమ్ జర్మనీ వెళ్లారు. అక్కడ మహేష్ కు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ ని నరేట్ చేశారట. ఫైనల్ స్క్రిప్ట్ సంతృప్తికరంగా వుండటంతో మహేష్ లాక్ చేశాడని, రెగ్యులర్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జూలై రెండవ వారం నుంచి ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నారట. ఇటలీలో వెకేషన్ పూర్తి చేసుకుని త్వరలోనే మహేష్ హైదరాబాద్ రాబోతున్నారు.
వచ్చిన వెంటనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని చక్ చకా మొదలు పెట్టేస్తారట. ఇందుకు దర్శకుడు త్రివిక్రమ్ ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఆ మధ్య జరిగిన పూజా కార్యక్రమాల్లోనూ పూజా హెగ్డే పాల్గొంది కూడా. అయితే తను డేట్స్ సమైస్య, రెమ్యునరేషన్ సమస్య కారణంగా ఈ మూవీ నుంచి తప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అలాంటిది ఏమీ లేదని, పూజా హెగ్డే విషయంలో తగ్గేదే లేదని.. ఈ మూవీలో తనే హీరోయిన్ అనిచిత్ర బృందం నుంచి క్లారిటీ వచ్చేసింది. పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకుందన్నది వట్టి రూమరేనని నిర్మాణ వర్గాలు కొట్టి పారేసినట్టుగా తెలిసింది. ఇదిలా వుంటే ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ ని రెడీ చేసే పనిలో వున్నాడని తెలిసింది.