టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించిన అత్యంత భారీ మల్టీస్టారర్ `RRR`. ఈ మూవీ కంటే ముందే `బాహుబలి`తో దేశ వ్యాప్తంగా జక్కన్న పేరు మారు మోగినా ఆ క్రేజ్ ని రెట్టింపు చేసిన సినిమా మాత్రం `RRR`. అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ భారతీయ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది.
రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ హాలీవుడ్ స్టార్స్ ని, విదేశీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి కీర్తి ప్రతిష్టలని ఈ మూవీ విశ్వవ్యాప్తం చేసింది. ఈ మూవీతో ఉత్తరాదిలో రాజమౌళి హాట్ ఫేవరేట్ గా మారిపోయారు. ఇదిలా వుంటే ఈ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చే అవకాశాలు వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ మూవీలో కొమురం భీం పాత్రలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆస్కార్ అవార్డ్ వరించే అవకాశాలు కనిపిస్తున్నాయని బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం విశేషం. దీంతో రాజమౌళి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఇదిలా వుంటే రాజమౌళి క్రేజ్ కు ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజ్య సభ సభ్యుడు కావడం మరింత ప్లస్ గా మారుతోందని చెబుతున్నారు.
విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెన్నై నుంచి రాజ్యసభ నామినేట్ అయిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం విజయేంద్ర ప్రపాద్ ని ఎంపీగా నామినేట్ చేసింది. ఇటీవలే ఎంపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన పార్టీ హైకమాండ్ తో పాటు విశ్వహిందూ పరిషత్ ని ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇందు కోసం స్వయం సేవక్ లపై ఓ సినిమాని, వెబ్ సిరీస్ ని తెరపైకి తీసుకురానున్నట్టుగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపత్యంలో రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాలకు ఉత్తరాదిలో విజయేంద్ర ప్రసాద్ కారణంగా బీజేపీ ఊతమివ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీకి అనుకూలంగా హిందుత్వని ప్రబోధించే చిత్రాలకు బీజేపీ ప్రభుత్వాలు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న `ది కశ్మీర్ ఫైల్స్` ఇందుకు పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఇదే తరమాలో ఇకపై రాజమౌళి తెరకెక్కించే సినిమాకు కూడా ఉత్తరాదిలో బీజేపీ వెన్నుదన్నుగా నిలవడం ఖాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.