యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడి గా నటిస్తోన్న తదుపరి చిత్రం `ఏ1- ఎక్స్ ప్రెస్` డీటెయిల్స్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. . డెన్నీస్ జీవన్ కొనుకొలను దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో నే సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం రక్తి కట్టించే చిత్రమిది. ఇందులో సందీప్ హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు. ఇటీవలే `నిను వీడని నీడను` చిత్రం తో బౌన్స్ బ్యాక్ అయిన నేపథ్యం లో సందీప్ రెట్టించిన ఉత్సాహం తో ఈ సినిమా చేస్తున్నాడు. దీనికి తోడు స్పోర్స్ట్ నేపథ్యం పాన్ ఇండియా కేటగిరీ లోకి వస్తోంది కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ పై కాన్ఫిడెంటు గా ఉన్నాడట
ఈ నేపథ్యం లో షూటింగ్ కోసం బేగంపేట లోని ఓ పెద్ద స్టేడియం ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. రెండు టీమ్ లలో అటువైపు 11 మంది.. ఇటువైపు 11 మంది.. మొత్తంగా 22 మంది హాకీ ప్లేయర్ల తో సాగే గేమ్ కాబట్టి భారీ స్టేడియం నే బుక్ చేశారని తెలుస్తోంది. గ్యాలరీ లో సిట్టింగ్ కెపాసీటీ కూడా అంతే భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆటకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఏకధాటి గా ఈ స్టేడియం లోనే చిత్రీకరించనున్నారట. స్టేడియం కు సంబంధించిన మొత్తం సన్నివేశాలు పూర్తి చేసిన తర్వాతే మిగతా సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఏ1కి సంబంధించిన మరో ఆసక్తికర అప్ డేట్ అందింది. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయిక గా ఎంపికైందట. తను ఇందులో లేడీ హాకీ ప్లేయర్ గా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా విశ్వ ప్రసాద్- అభిషేక్ అగర్వాల్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.