స్టాండ‌ప్ రాహుల్.. నేటిత‌రానికి ఫ‌న్ కిక్ గ్యారెంటీ

Update: 2022-03-05 03:29 GMT
అల్ల‌రి చిల్ల‌ర వేషాల‌తో అల‌రించే స‌త్తా ఉన్న హీరోగా.. నేటిత‌రం యూత్ ఐక‌న్ గా క‌నిపిస్తాడు రాజ్ త‌రుణ్‌. న‌టించిన తొలి సినిమా ఉయ్యాల జంపాల‌తోనే అది నిరూప‌ణ అయ్యింది. సినిమా చూపిస్త మావా లోనూ ఈ ఫార్ములా వ‌ర్క‌వుటైంది. అల్ల‌రి ప్రేమికుడిగా మెప్పించాడు. ఇటీవ‌ల ప‌రాజ‌యాలు ఎదురైనా కానీ మ‌రో ప్ర‌య‌త్నం కాన్ఫిడెంట్ గా చేస్తున్న‌ట్టే అనిపిస్తోంది.

హీరో రాజ్ తరుణ్ తదుపరి సాంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో నందకుమార్ అబ్బినేని - భరత్ మగులూరి నిర్మించిన పట్టణ ఆధారిత రోమ్-కామ్ చిత్రం `స్టాండ్ అప్ రాహుల్‌`లో కనిపించనున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైందిరాజ్ తరుణ్ స్టేజ్ పై స్టాండ్-అప్ కామెడీ ప్ర‌ద‌ర్శ‌కుడిగా క‌నిపించ‌డంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ద్వంద్వార్థాలు ధ్వనించినా కానీ ఫన్ తో ట్రైల‌ర్ అల‌రించింది. నేటిత‌రం ఇష్ట‌ప‌డే చమత్కారాలు ఫ‌న్ కి ఇందులో కొద‌వేమీ లేద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఇక క‌థాంశం విష‌యానికి వ‌స్తే.. రాహుల్ పాత్ర ఆద్యంతం హైలైట్ గా క‌నిపిస్తోంది. తనను తాను స్టాండ్ అప్ కమెడియన్ గా నిరూపించుకోవాలనుకునే రాహుల్ క‌ల నెర‌వేరిందా లేదా? అన్న‌ది సినిమాలో చూడాల్సి ఉంటుంది. ఇక అత‌డి ల‌క్ష్్యానికి తన ప్రియురాలు వర్ష బొల్లమ్మ ఎలాంటి సాయం చేసింది? ఈ ప్రయాణంలో అనేక అడ్డంకులేమిటి? అన్న‌దే ఈ సినిమా. నేటి జ‌న‌రేష్ యూత్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ క‌హానీల గురించి ట్రైల‌ర్ లో చెప్పారు.

రాజ్ తరుణ్ కేవ‌లం ప‌ల్లెటూరి అల్ల‌రోడిగానే కాదు.. అర్బన్ పాత్రలకు కూడా సరిగ్గా సరిపోతాడని నిరూపించాడు. అతను అల్లరిగా కనిపించాడు. అలాగే వర్షా బొల్లమ్మ తన పాత్రలో కూల్ గా కనిపించింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులుగా ఇంద్రజ మరియు మురళీ శర్మ తమ పాత్రలను పోషించారు. సంతో మోహన్ వీరంకి రచన.. ద‌ర్శ‌క‌త్వానికి గుర్తింపు ద‌క్క‌నుంది. అగస్తీ యొక్క సంగీతం ప‌నిత‌నం ఆక‌ట్టుకుంది.  ట్రైలర్ ఖచ్చితంగా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. కొంత‌ కాలంగా మాంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్న రాజ్ త‌రుణ్ కి బిగ్ బ్రేక్ వ‌స్తుందా లేదా అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.
Full View
Tags:    

Similar News