ఆస్కార్ విజేత ఏం చేసిందంటే

Update: 2018-03-05 12:57 GMT
ఆస్కార్ అవార్డు... సినీ ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి ఒక్క న‌టుడి క‌ల‌. ఆస్కార్ ను మించిన అవార్డు సినీ జ‌గ‌త్తులో లేదు. అలాంటి అకాడ‌మీ అవార్డు వ‌చ్చిందంటే ఆనంద‌మే క‌దా. ఆదివారం రాత్రి లాస్ ఏంజ‌ల‌స్‌ లో ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. ఆ కార్య‌క్ర‌మంలో ఉత్త‌మ న‌టిగా నిలిచిన అమెరిక‌న్ న‌టి చేసిన ప‌ని అంద‌రి చేత చప్ప‌ట్లు కొట్టించింది.

ఫ్రాన్సెస్ మెక్డోర్మాండ్... అమెరికాకు సీనియ‌ర్ న‌టి. గ‌తంలోనే ఆమెకు ఉత్తమ స‌హాయ న‌టి అవార్డు వ‌చ్చింది. ఈసారి ఆమె ఉత్త‌మ న‌టి పోటీలో నిలిచింది. ఆమెతో పాటూ మ‌రికొంద‌రు న‌టీమ‌ణులు ఆ రేస్‌ లో ఉన్నారు. ఆస్కార్ క‌మిటీ ఫ్రాన్సెస్ నే ఉత్త‌మ న‌టిగా ప్ర‌క‌టించింది. స్టేజీ మీద‌కు వ‌చ్చి అవార్డు అందుకున్న ఫ్రాన్సెస్‌... ఆ అవార్డును స్టేజీపై నేల మీద పెట్టింది. త‌న‌తో పాటూ ఎవ‌రైతే అవార్డుల రేసులో నిలిచారో ఆ మ‌హిళంద‌రినీ  నిల‌బ‌డ‌మ‌ని కోరింది. అనంత‌రం అక్క‌డున్న వారంద‌రికీ... మా ద‌గ్గ‌ర చాలా క‌థ‌లు ఉన్నాయ‌ని... కానీ ఫైనాన్షియ‌ర్లే కావాల‌ని చెప్పింది. ఆమె మొద‌ట ఆస్కార్ అవార్డును వేదిక‌పై కింద పెట్ట‌డం అక్క‌డున్న వారంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

త్రీ బిల్‌ బోర్డ్స్ ఔట్‌ సౌడ్ ఎబ్బింగ్ - మిస్సౌరి... అనే సినిమాలో ఫ్రాన్సెస్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులే కాదు... అవార్డులూ ఫిదా అయ్యాయి. ఆ సినిమాతో ఏడాది మొత్తం అనేక అవార్డుల‌ను ఫ్రాన్సెస్ కొల్ల‌గొట్టింది. రేప్ చేసి చంప‌బ‌డ్డ త‌న కూతురు కేసులో న్యాయం కావాల‌ని త‌పించిన త‌ల్లిగా ఫ్రాన్సెస్ చాలా బాగా న‌టించింది.

Full View
Tags:    

Similar News