స్టార్‌ క్రికెటర్‌ భార్య సినిమాల్లోకి రీ ఎంట్రీ

Update: 2022-01-01 08:33 GMT
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బాలీవుడ్‌ లో పలు సూపర్ హిట్ చిత్రాలను చేసిన విషయం తెల్సిందే. విరాట్ తో వివాహం అయిన తర్వాత కూడా అనుష్క శర్మ నటించి సక్సెస్ లను దక్కించుకుంది. విలక్షణ పాత్రల్లో నటించి నటిగా తన స్టామినాను నిరూపించుకున్న అనుష్క శర్మ గత రెండేళ్లుగా సినిమాల్లో యాక్టివ్ గా లేదు. కరోనాకు ముందు అనుష్క సినిమాలు విడుదల అయ్యాయి. కాని ఆ తర్వాత నుండి ఆమె కొత్త సినిమాలకు కమిట్‌ అవ్వలేదు. కారణం ఆమె గర్బం దాల్చడం.. ఆ తర్వాత డెలవరీ.. వారి పాప ను చూసుకోవడం వంటి పనులతో ఆమె బిజీగా ఉండి పోయింది. ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు గాను సిద్దం అయ్యింది.

కూతురు కాస్త పెద్దది అవ్వడం తో అనుష్క మళ్లీ నటించాలని ఆశ పడుతుంది. సాదారణంగా అయితే పెళ్లి అయ్యి తల్లి అయిన వారికి అవకాశాలు తగ్గుతాయి. కాని కొందరు హీరోయిన్స్ విషయంలో అది రివర్స్ అవుతుంది. పిల్లలు అయిన తర్వాత కూడా స్టార్స్ గా కొనసాగుతున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అనుష్క శర్మ కూడా కూతురుకు జన్మనిచ్చిన తర్వాత కూడా హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయబోతుంది. ఆమె సినిమాలు తిరిగి చేయాలని అనుకుంటున్న వెంటనే ఆమె రెండు సినిమాలకు ఓకే చెప్పింది. ఆమె ముందు మరికొన్ని ప్రాజెక్ట్‌ లు కూడా ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్‌ గ్యాప్‌ ఇవ్వకుండా సినిమాలు చేయాలని అనుష్క భావిస్తుందట.

అనుష్క బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల సరసన నటించి మెప్పించింది. విరాట్ ను వివాహం చేసుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. డెలవరీ తర్వాత మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టబోతున్న అనుష్క ఇక ముందు ఎలాంటి సినిమాలు చేస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విరాట్‌ అభిమానులు మాత్రం సోషల్‌ మీడియాలో అనుష్క ను ఉద్దేశించి.. విరాట్ పరువు తీసే సినిమాలు కాకుండా మంచి సినిమాలు.. పాత్రలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర హీరోయిన్స్ మాదిరిగా అందాల ప్రదర్శణ మీ నుండి ఆశించడం లేదు అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.




Tags:    

Similar News