పబ్ కల్చర్ పై ఇటీవలి కాలంలో హైదరాబాద్ పోలీస్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ సంస్కృతికి కేరాఫ్ అడ్రెస్ గా మారుతుండడంతో హైటెక్ పబ్బులపై ఖాకీలు అదే పనిగా కన్నేశారు. అదే క్రమంలో పబ్బుల నిర్వహణపై రకరకాల పరిమితుల్ని విధించారు. మిడ్ నైట్ 12 తర్వాత పబ్ ని నిర్వహించకూడదన్నది ఒక రూల్. అయితే రూల్ మీరి ఆ తర్వాతా పబ్ లో పార్టీలు నిర్వహిస్తే కఠినమైన శిక్షల్ని అమలు చేస్తున్నారు. ఎంతటి ప్రముఖులు అయినా సరే అరెస్టు చేసేందుకు పోలీసులు వెనకాడడం లేదు.
తాజాగా హైదరాబాద్ లోని ఐదు నక్షత్రాల హోటల్లోని ఓ ప్రముఖ పబ్ లో మిడ్ నైట్ తర్వాత సెలబ్రిటీల అరెస్టుల ఫర్వం కొనసాగడం సంచలనమైంది. ఇందులో బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అలానే అరెస్టయిన 150 మందిలో సుమారు 40 మంది కీలక వ్యక్తులను అదుపులో ఉంచుకుని పోలీసులు విచారిస్తున్నట్టు కథనాలొచ్చాయి. ఆ నలభై మందిలో ఓ ప్రముఖ నటుడి కుమార్తె ఉందన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికి ఆమె ఎవరు? అన్నది ఎవరూ రివీల్ చేయలేదు.
సదరు నటుడి కుమార్తె కూడా సినీరంగంలోనే సెలబ్రిటీ అని గుసగుస వినిపిస్తోంది. తన స్నేహితులు భాగస్వామితో కలిసి సదరు నటి హోటల్ లో వారాంతపు పార్టీకి వెళ్లింది. పార్టీ గర్ల్ గా ఫ్యాషన్ ఐకాన్ గా ఇప్పటికే పేరున్న తను చిక్కుల్లో పడడం చర్చనీయాంశమైంది. ఈ పార్టీలో అరెస్టయిన ప్రముఖులపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. మునుముందు మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.