హాలీవుడ్ నుండి మొదలుకుని టాలీవుడ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వరకు కూడా వెబ్ సిరీస్ ల పై ఆసక్తి చూపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ లు కూడా సినిమాలను మించి రూపొందిస్తున్నారు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ బాలీవుడ్ సినిమాలను మించి ఉంది అంటూ ప్రశంసలు దక్కించుకుంది. అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్స్ లో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటికి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన కూడా లభిస్తోంది. కనుక ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కూడా పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ లను తెరకెక్కించేందుకు సిద్దం అవున్నారు.
ఒకప్పుడు వెబ్ సిరీస్ లు అంటే చిన్న చూపు చూసిన స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు మాత్రం తమకు వస్తున్న ఆఫర్లను కాదనుకుండా ఓకే చెప్తున్నారు. భారీ భారీ వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవల వెబ్ సిరీస్ లు ఇండియాలో కూడా విపరీతమైన అధరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో స్టార్ డైరెక్టర్స్ పలువురు వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. ఇప్పటికే పలు భాషల స్టార్ డైరెక్టర్స్ కూడా వెబ్ సిరీస్ లను తెరకెక్కించారు. ఆ జాబితాలో బాలీవుడ్ స్టార్ కమర్షియల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా చేరబోతున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కమర్షియల్ డైరెక్టర్ రోహిత్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారి కోసం ఒక భారీ వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నాడు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్న ఆ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్స్ నటిస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. రోహిత్ శెట్టి వెబ్ సిరీస్ అంటే ఖచ్చితంగా స్టార్స్ ఆసక్తిగా ఉంటారు. కనుక ఇప్పటి వరకు హిందీలో వచ్చిన వెబ్ సిరీస్ ల్లోకి ఇది ది బెస్ట్ గా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శెట్టి తో అమెజాన్ వారు ఇప్పటికే ఒప్పందం చేసుకోవడంతో పాటు ఒక స్క్రిప్ట్ కు కూడా ఓకే చెప్పారట. ప్రస్తుతం రోహిత్ శెట్టి బాలీవుడ్ యంగ్ స్టార్ రణవీర్ సింగ్ తో చేస్తున్న సినిమా ను ముగించి ఆ తర్వాత కొత్త వెబ్ సిరీస్ పనుల్లో పడుతాడనే టాక్ కూడా వినిపిస్తుంది.
ఒక వైపు దర్శకుడిగా మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరో వైపు టీవీ షో ల్లో గెస్ట్ గా హోస్ట్ గా చిన్న చిన్న రోల్స్ లో కూడా కనిపించిన రోహిత్ శెట్టి ఈ సారి వెబ్ సిరీస్ మేకింగ్ పై దృష్టి పెట్టడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా వెబ్ సిరీస్ వైపు చూస్తున్నారు. బాలీవుడ్ లో భారీ వసూళ్లను నమోదు చేసిన సినిమా లను తెరకెక్కించిన ఈయన దర్శకత్వంలో రూపొందిన రెండు సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ సినిమా ల తర్వాత ఈయన క్రేజ్ మరింతగా పెరుగుతుంది. బాలీవుడ్ లో సూపర్ స్టార్ లు సైతం ఈయన దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దంగా ఉంటారు. అయినా కూడా ఈయన మాత్రం వెబ్ సిరీస్ ను కమిట్ అయ్యాడు అంటే ఏ రేంజ్ లో వెబ్ సిరీస్ లకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.