విజయ్ సేతుపతి ఈమధ్య కొలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడమే కాదు.. ఇతర అంశాలలో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా విజయ్ సేతుపతి రెండు తెల్ల పులులను దత్తత తీసుకున్నాడు.
చెన్నైలోని అన్నా జూలాజికల్ పార్క్ లో ఉండే నాలుగున్నర సంవత్సరాల వయసున్న ఆర్తి.. ఐదేళ్ళ వయసు గల ఆదిత్య అనే తెల్ల పులులను దత్తత తీసుకోవడమే కాకుండా జూ వారికి నిర్వహణ ఖర్చుల కోసం మరో రూ. 5 లక్షల రూపాయలను విరాళం ఇచ్చాడు. విజయ్ సేతుపతి చేసిన మంచిపనికి అన్నివైపులా నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. పులులను దత్తతీసుకున్న సందర్భంగా మాట్లాడుతూ జు ను రెగ్యులర్ గా సందర్శించాలని ప్రజలకు విజ్జప్తి చేశాడు. జంతు ప్రదర్శనశాల లోనికి వచ్చినప్పుడు నగరం మధ్యలో అడవి ఉన్నటుగా అనిపిస్తుందని.. అసలు చాలా అడవులలో లేని జంతువులు ఇక్కడ జూలో ఉన్నాయని అన్నాడు. షాపింగ్ మాల్ కు వెళ్ళినట్టే.. బీచ్ కు వెళ్ళినట్టే జూకి కూడా వెళ్లాలని అన్నాడు. విజయ్ సేతుపతి మాత్రమే కాదు.. గతంలో శివకార్తికేయన్.. కార్తి లాంటి హీరోలు కూడా తెల్లపులుల సరంక్షణలో భాగంగా వాటిని దత్తత తీసుకున్నారు.
సినిమాల విషయానికి వస్తే విజయ్ సేతుపతి ప్రస్తుతం విజయ్ చందర్ దర్శకత్వంలో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకో సినిమా 'సూపర్ డీలక్స్' విడుదలకు సిద్ధంగా ఉంది.