అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్. రాజధాని లీక్డ్ సమాచారం చాలా ముందుగానే అందుకుని వందల ఎకరాలు కొన్నవాళ్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. రేయింబవళ్లు అసలు కంటికి కునుకు పట్టని పరిస్తితి. అదిగదిగో అమరావతి రాజధాని! అంటూ ఒకే ఒక్క ప్రకటన వెలువడిన తర్వాతా.. హైదరాబాద్ నుంచి పరుగు పరుగున విజయవాడ రైలు ఎక్కిన వాళ్లు.. వాయు మార్గంలో ప్రయాణించిన వాళ్లలో రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తలు.. పత్రికాధిపతులు వీళ్లతో పాటే సినీప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు వీరంతా గొల్లుమనాల్సిన ధైన్యమైన స్థితి. సీఎం వైయస్ జగన్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో అమరావతి రాజధాని అటకెక్కింది. అమరావతి పేరుతో రియల్ వెంచర్లు ప్లాన్ చేసిన బడా బాబులకు చుక్కలు కనిపించాయి. రాజధాని బూచీతో కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని వెదజల్లిన బడా బాబులందరికీ దిమ్మ తిరిగిపోయింది. రాజధాని వైజాగ్ కి తరలి వెళ్లిపోతోందన్న కలత కంటికి కునుకు పట్టనీకుండా చేస్తోంది.
ఆ ఒక్క దెబ్బకు రేయింబవళ్లు కంటికి కునుకు పట్టని ధీనమైన పరిస్థితి కనిపిస్తోందట. అదంతా సరే కానీ.. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో రాటు దేలిన ఓ సినీ హీరో పెద్ద మొత్తంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టడంపై ప్రస్తుతం టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. తన చుట్టాలు పక్కాలు బంధువుల పేరుతో అతడు దాదాపు 500 ఎకరాలు కొనిపించారట. ఇప్పుడు ఉన్న ఫలాన రాజధాని విశాఖ నగరానికి జంప్ అయిపోవడంతో కక్కలేక మింగ లేక లబోదిబోమనే పరిస్థితి నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
500 ఎకరాలు అంటే మాటలా? అందుకోసం ఎన్నికోట్లు వెదజల్లారో అంటూ గుసగుస వేడెక్కిస్తోంది. రాజధాని బూచీతో ఒక్కో ఎకరం రూ.3-5 కోట్ల మేర డిమాండ్ పలికింది. అంత పెద్ద మొత్తం అయినా ఎలాంటి భయం లేకుండా అన్ని ఎకరాల్ని కొనేశారు. ఇప్పుడు రాజధాని తరలిపోవడంతో ఏకంగా లక్షల్లోకి విలువ పడిపోయింది. దీంతో కక్కలేని మింగలేని పరిస్థితి నెలకొందట. గొల్లుమనలేక.. లబోదిబోమని బయటపడలేక ఇంకా షాక్ లోనే ఉన్నారట!!