స్టార్‌ హీరో కూతురు 'గే' రొమాన్స్‌!

Update: 2021-07-07 06:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ వరుస చిత్రాలతో కెరీర్ లో దూసుకు పోతుంది. బాలీవుడ్‌ లో కాబోయే టాప్ స్టార్‌ హీరోయిన్ అంటూ ఈ అమ్మడి గురించి అభిమానులు ముచ్చటించుకుంటూ ఉంటారు. స్టార్ కిడ్‌ అయినా కూడా కష్టపడి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు కష్టపడుతూనే ఉంది. వరుసగా చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకునేందుకు చాలానే కష్టపడుతోంది. ఈ అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో యంగ్‌ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు ఈమె మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయింది.

ఇక ఒకసారి సారా తో వర్క్‌ చేసిన వారు మళ్లీ ఆమెతో సినిమా ను చేయాలని కోరుకుంటారు. తాజాగా సారా అలీ ఖాన్ తో అత్రంగీ రే అనే సినిమాను నిర్మిస్తున్న ఆనంద్ ఎల్‌ రాయ్ ఈమెతో మరో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. అత్రంగీ రే సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే ఆ సినిమా పూర్తి చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత సారా అలీ ఖాన్‌ హీరోయిన్‌ గా ఆనంద్ ఎల్‌ రాయ్ సినిమా నిర్మించబోతున్నాడు. హీరోగా విక్కీ కౌశల్‌ తమ్ముడు సన్నీ కౌశల్‌ నటించబోతున్నాడు.

రాహుల్‌ శాంకల్య దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా లో సన్నీ కౌశల్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. ఆడ లక్షణాలు కలిగి ఉండే అబ్బాయి పాత్ర అతడిది అంటున్నారు. అమ్మాయిగా మాట్లాడుతూ ప్రవర్తించడం మాత్రమే కాకుండా అమ్మాయిలా డ్రస్సింగ్‌ ను కూడా ట్రై చేసే పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. అలాంటి సన్నీ కౌశల్ తో సారా అలీ ఖాన్‌ లవ్‌ అండ్ రొమాన్స్ చేయబోతుందని అంటున్నారు. అంటే ఇది ఓ గే తరహా లవ్ స్టోరీ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అయితే సినిమాలో సన్నీ కౌశల్ అమ్మాయిగా కనిపించేందుకు మాట్లాడేందుకు కారణం ఉంటుందట. అది కన్విన్సింగ్ గా దర్శకుడు చూపించేందుకు ప్రయత్నిస్తాడా లేదా అనేది చూడాలి.

సారా అలీ ఖాన్‌ వరుస సినిమాలు వచ్చే ఏడాది బాక్సాఫీస్ ముందుకు బ్యాక్ టు బ్యాక్‌ వస్తున్నాయి. ఆమె గ్యాప్ లో వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉంది. మొత్తానికి స్టార్‌ హీరో కూతురు అయినా కూడా ఒక్కసారిగా స్టార్ డం దక్కించుకోకుండా కష్టపడి స్టార్‌ గా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నందుకు అభినందనీయం. ఇక ఈ సినిమాలో ఆమె కమిట్ అయిన పాత్ర నిజంగా మరే హీరోయిన్ కూడా చేసేందుకు ఒప్పుకునే అవకాశం ఉండేది కాదంటున్నారు.
Tags:    

Similar News