తమిళ స్టార్ నటుడు శింబు తండ్రి అయిన టీ రాజేందర్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడు. ఛాతిలో నొప్పి తో పాటు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండటంతో చెన్నైలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ఐసీయూలో ఉంచి టీ రాజేందర్ కు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి కుదుట పడకపోవడంతో విదేశాలకు ఆయనను తరలించేందుకు శింబు ఏర్పాట్లు చేస్తున్నాడట.
విదేశాలకు తీసుకు వెళ్లబోతున్నట్లుగా స్వయంగా మీడియాకు శింబు వెళ్లడించడంతో రాజేందర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమిళ మీడియా వర్గాల్లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆయన శ్వాసకు సంబంధించిన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా చెన్నై లో వైద్యులు చేతులు ఎత్తేశారని అందుకే విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తండ్రి రాజేందర్ ఆరోగ్యం విషయంలో శింబు చాలా ఆందోళనతో కనిపిస్తున్నాడు. వెంటనే విదేశాలకు తీసుకు వెళితే బాగుంటుందని.. ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా మంచిది కాదని వైద్యులు కూడా శింబుకు సలహా ఇవ్వడంతో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాజేందర్ ను ఏ దేశంకు తీసుకు వెళ్తారు అనే విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సింగపూర్ కు అంటూ ఎక్కువ శాతం మంది చర్చించుకుంటున్నారు.
రాజేందర్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా.. సంగీత దర్శకుడిగా... స్క్రీన్ ప్లే రైటర్ గా.. నిర్మాతగా ఇలా సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నట్లుగా పేరును దక్కించుకున్నాడు. అలాంటి రాజేందర్ అనారోగ్యం బారిన పడటంతో ఎంతో మంది అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తు ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేస్తూ ఉన్నారు.