స్టార్ హీరో ఆరోగ్య పరిస్థితి విషమం.. దుబాయ్ కు తరలింపు

Update: 2021-08-30 14:30 GMT
కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకొని బయటకు వచ్చిన ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. ఇవాళ అత్యవసర వైద్య చికిత్సల కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు విజయ్ కాంత్. కుమారుడుతో కలిసి చికిత్స కోసం చెన్నై ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ ప్రయాణం అయ్యారు. ఆయన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడి నుంచి అమెరికాకు కూడా తీసుకెళతారని సమాచారం.  తీవ్ర అనారోగ్యం ఒకవేళ దుబాయ్ లో చూపించన తర్వాత నయం కాకుంటే అమెరికాకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు.

కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత ఏడాది కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చికిత్స తీసుకొని సురక్షితంగా బయటపడ్డాడు. కానీ తర్వాత మళ్లీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఇప్పుడు అత్యవసరంగా దుబాయ్ తీసుకెళుతున్నారు.
Tags:    

Similar News