కొడుకుకు 'కంధన్' అని పేరుపెట్టిన స్టార్ హీరో..!

Update: 2021-03-18 16:30 GMT
సౌత్ ఇండియన్ సినీహీరో కార్తీ.. గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ప్రస్తుతం పలు సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే కార్తీ చివరిగా ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకొని వందకోట్ల క్లబ్ లో చేరాడు. ఇదిలా ఉండగా.. కార్తీ ఇటీవలే పుట్టిన తన కొడుకు పేరును బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కార్తీ, తన భార్య రంజిని అలాగే కూతురు ఉమయాల్ ముగ్గురు కలిసి బాబుకు కంధన్ అని పేరు పెట్టారు. కంధన్ అనే పేరు తమిళంలో మురుగన్ అని పిలుచుకునే దేవుడి పేర్లలో ఒకటి. అయితే కొడుకు పేరుతో పాటు కార్తీ.. బాబు చేతుల ఫోటో పోస్ట్ చేసి అందమైన సందేశం రాసాడు. కార్తీ, రంజనిలకు 2020 అక్టోబర్ 20న కంధన్ కు జన్మనిచ్చారు.

కార్తీ తన కొడుకు పేరును ప్రకటిస్తూ.. తమిళంలో కార్తీ సందేశం ఇలా రాసాడు. "ప్రియమైన బుజ్జిబాబుకు.. మీ అమ్మ, అక్క అలాగే నేను ముగ్గురం కలిసి నీకు 'కంధన్' అని పేరు పెట్టాము. నీరాక మన కుటుంబంలో మరింత మధురాన్ని నింపింది. ప్రేమతో మీ నాన్న" అంటూ కొడుకు పై తన ప్రేమను మధురంగా బయటపెట్టాడు కార్తీ. ప్రస్తుతం కార్తీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ పెట్టినప్పటి నుండి కార్తీకి సోషల్ మీడియా ద్వారా అభిమానులు, సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కార్తీ కొడుకు రాకతో చెప్పలేని ఆనందంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తీ ప్రస్తుతం సుల్తాన్ సినిమాతో విడుదలకు రెడీ అవుతున్నాడు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ సినిమాతో రష్మిక మందన తమిళంలో అడుగుపెడుతోంది. అలాగే కార్తీ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.




Tags:    

Similar News