ఒకప్పుడు చీకటి పడితే ఆ సన్నని మట్టి రోడ్ లో వెళ్లేందుకే భయపడేవారు. అదో ఊరు ప్రయాణంలాగా భావించేవారు. అక్కడ నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ లో ప్రెస్ మీట్ ఉంది అంటే సినీ మీడియా కోసం ప్రత్యేకించి ఫిలింఛాంబర్ నుంచి వాహనాల్ని ఏర్పాటు చేసేవారు. రాత్రిపూట ఆ చీకటి రోడ్ లో ఒంటరి ప్రయాణానికి భయపడేవారు. కేవలం ఐదారేళ్ల కిందటి మాట ఇది. అలాంటి చోటు ఇప్పుడెలా ఉంది? కనీస మాత్రంగా అయినా ఊహించగలరా? ఈ ఒక్క ఏరియాలో అక్షరాలా లక్ష కోట్ల రియల్ బిజినెస్ సాగుతోంది ఇక్కడ.
నానక్ రామ్ గూడ అంటే ఇప్పుడు ఖరీదైన సాఫ్ట్ వేర్ హబ్. చుట్టూ సువిశాలమైన రోడ్ కమ్యూనికేషన్ .. గచ్చిబౌళికి కూత వేటు దూరంలో కొన్ని లక్షల కోట్ల కార్పొరెట్ బిల్డింగులకు అత్యంత సమీపంగా ఉన్న ఖరీదైన ప్రైమ్ ఏరియాగా మారింది. ఈచోట కొన్ని వేల లక్షల కోట్ల రియల్ బిజినెస్ సాగుతోంది. ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఎంతోమంది సినిమా వోళ్లు సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారు. ఇక్కడే పరిశ్రమ 24 శాఖల కార్మికులు ఉండే చిత్రపురి కాలనీ సైతం ఉంది. చిత్రపురిని ఆనుకుని వేల కోట్ల విలువైన ల్యాంకో హిల్స్ టవర్స్ కనిపిస్తాయి. ఆ చుట్టు పక్కల పరిసరాల్లోని దర్గా- మణికొండ- పుప్పాల గూడ ఏరియాలోనే కొన్ని వందల మంది సినిమా- టీవీ రంగాలకు చెందిన స్టార్లు .. దర్శకనిర్మాతలు సొంతంగా ఇళ్ల స్థలాలు- ఇండ్లు కొనుక్కుని నివసిస్తున్నారు. ఇక ఈ ఏరియాను దాటుకుని కాస్తంత అవతల వైపుకు వెళితే కేవలం కిలోమీటర్ దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ తగుల్తుంది. గచ్చి బౌళి నుంచి అటు విజయవాడ పోయే హైవేకు ఇది కనెక్టివిటీ. ఇక ఈ రింగ్ రోడ్ పరిసరాల్లోనే జయభేరి సంస్థకు చెందిన భారీ రియల్ వెంచర్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పేరుతో ఇక్కడ కొన్ని లక్షల కోట్ల రియల్ బిజినెస్ జరుగుతోందన్నది నిపుణుల విశ్లేషణ.
తాజా సమాచారం ప్రకారం.. ఓ ప్రముఖ కథానాయకుడికి చెందిన ఏడెనిమిదెకరాల భూమిలో దాదాపు 200 కోట్ల మేర రియల్ బిజినెస్ చేశారని తెలుస్తోంది. ఇది కేవలం ఈ నాలుగేళ్లలో జరిగిన డెవలప్ మెంట్. నానక్ రామ్ గూడ ఫామ్ హౌస్ గా చెప్పుకునే ఈ భూమిలో నివాస స్థలం.. గెస్ట్ హౌస్ మినహాయించుకుని ఏడెనిమిదెకరాల ల్యాండ్ పై ఇంత బిజినెస్ చేశారని చెబుతున్నారు. ఇదివరకూ ఇదంతా ఒక తోటలాగా కళకళలాడేది. అందులో ఇల్లు కొంత ప్లేస్ ఉంచుకుని మిగతాది రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చేశారని చెబుతున్నారు. పలు కార్పెరెట్ కంపెనీలు.. ఫైనాన్షియల్ జిల్లా.. విప్రో లాంటి ప్రముఖ సంస్థలు ఈ స్థలానికి అత్యంత సమీపంలోనే ఉన్నాయి. వివరాలు ఆరాతీస్తే.. ప్రఖ్యాత ఫోనిక్స్ గ్రూప్ కి ఆ ల్యాండ్ ని డెవలప్ మెంట్ కి ఇచ్చారని తెలుస్తోంది.