10 కోట్ల కోసం స్టార్ హీరోని బెదిరిస్తున్నారట!

Update: 2016-11-11 17:30 GMT
టాలీవుడ్ లో ఆయనో స్టార్ హీరో. పది కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకునే అతి తక్కువ మందిలో ఆయన కూడా ఒకరు. తాజాగా హైద్రాబాద్ జూబిలీ హిల్స్ లో ఈయనో ఖరీదైన ల్యాండ్ కొనుగోలు చేశాడు. దాని రేటు అక్షరాలా 10 కోట్ల రూపాయలు. ఇప్పటికే ల్యాండ్ డీల్ మాత్రమే కాదు.. పేమెంట్ కూడా పూర్తయిపోయింది.

అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే.. అంతా మోడీ చేసిన మహత్యం. రీసెంట్ గా ఓ సినిమాకు అంగీకరిస్తే.. ఆ ప్రొడ్యూసర్ 10 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్(500.. 1000 నోట్లు అని అర్ధమైందిగా) తెచ్చి చేతుల్లో పోశాడు. ఈ అమౌంట్ మొత్తం అటు ఇచ్చేసి.. ఓ ల్యాండ్ కొనేశాడీ స్టార్ హీరో. ఇది జరిగిన వారం రోజులకే ప్రధాని మోడీ.. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఆ ల్యాండ్ ఓనర్ గొంతులో వెలక్కాయ్ పడిపోయింది.

అటు నిర్మాత కానీ.. ఇటు స్టార్ హీరో కానీ.. ఈ అమౌంట్ గురించి పైకి చెప్పగలిగే పరిస్థితి లేదు. దీన్ని గ్రహించిన ల్యాండ్ ఓనర్.. తనకు ఇప్పుడు చెల్లుబాటయ్యే కరెన్సీతో పేమెంట్స్ చేయకపోతే.. మీడియాకి ఎక్కేస్తానని బెదిరిస్తున్నాడట. ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లోన ఈ అమౌంట్ ను సెటిల్ చేయాల్సి వస్తోందట ఆ హీరోకి. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలోనే ఉన్నాడట ఆ హీరో గారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News