ఎందరు హీరోలు ఉన్నా ఆయనెంతో స్పెషల్. కళ అంటే ప్రాణం పెట్టేసే కళాకారుడు. అభినయం - వాచకం - నాట్యం తెలిసిన మేటి నటుడు. ఈ విశ్వాన్ని గుప్పిట పట్టిన యూనివర్శల్ హీరో. ఆయన టీనేజీలోనే ఈ రంగంలో అడుగుపెట్టి - యుక్తవయసులోనే ఎన్నో సాధించారు. ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించారు. గొప్ప ప్రయోగాత్మకత తెలిసిన - వైవిధ్యానికి కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే అసాధారణ ప్రజ్ఞావంతుడు. అతడి కెరీర్ పరంగా వేలు పెట్టి చూపించడానికే లేదు. అలానే వ్యక్తిగత జీవితంలోనూ గొప్ప రోమియోగా పేరు బడ్డారు.
అయితే యుక్తవయసులో ఏం చేసినా చెల్లిపోతుంది. కానీ కాలక్రమంలో వయసు మీద పడ్డాక ఆటోమెటిగ్గా స్పీడ్ తగ్గిపోతుంది కదా! కానీ ఆ విషయంలో మాత్రం సదరు హీరో ఇప్పటికీ అదే జోరు మెయింటెయిన్ చేయడం ఇటీవల చర్చకొచ్చింది. సదరు నటుడు ఎంకి నాయుడు మామ టైపు. సందె వేళ అరటితోట పక్కకొస్తవా మామా! నువ్వు రమ్మంటే రాకుండా ఉంటనంటవే పిల్లా! అనేంత హుషారుగా ఉంటారు.
60 ప్లస్ అగ్రహీరో పక్కా రొమాంటిక్ ఫెలో. ఇదివరకూ రొమాంటిక్ మేయర్‌గా ఓ సినిమాలో అద్భుత అభినయంతో మెప్పించారు. సదరు రొమాంటిక్ మేయర్ గారి తరహాలోనే ఇప్పటికీ అదే యాటిట్యూడ్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇటు వృత్తిగతంగా - అటు వ్యక్తిగతంగానూ. ఈ వయసులోనూ ఎక్కడా చెదరని గ్లామర్ తో అతడు మైమరిపిస్తుంటారు. మీరు పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడూ అలా ఉన్నారు.. అంటే.. మీరు కూడా! అంటూ సింపుల్ గా సెటైర్ వేసేస్తారు. అతడు సినిమా తీస్తే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. అటొకరు.. ఇటొకరు లేనిదే నటించరు. మనసుండాలే కానీ, వయసుతో పనేం ఉంది. రసిక సామ్రాజ్యంలో ఎవరు ఉత్సాహవంతుడో వారికే నాయికలు పట్టంగడతారనడంలో సందేహం లేదు. అయితే ఇంతటి ఒత్తిళ్ల ప్రపంచంలోనూ ఇప్పటికీ ఆయన ఇలానే అంత రొమాంటిగ్గా ఎలా నెగ్గు కొస్తున్నారో అసలు ఆ సీక్రెట్ ఎవరికైనా చెప్పారో లేదో!