బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఢిల్లీలోని ఓ పబ్ ఎదుట గొడవపడ్డాడంటూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియా మధ్యమాలలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు పబ్ దగ్గర తిట్టుకుంటూ కొట్టుకుంటున్న ఈ వీడియోలో వైట్ డ్రెస్ ధరించిన వ్యక్తి అజయ్ దేవగన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. అజయ్ దురుసు ప్రవర్తన కారణంగా చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇది కూడా అలాంటిదే అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అజయ్ దేవగన్ టీమ్ దీనిపై స్పందించి ఢిల్లీ ఘర్షణ వీడియోలో ఉన్న వ్యక్తి అజయ్ కాదని ఒక ప్రకటన విడుదల చేసింది.
“జనవరి 2020 లో ‘తన్హాజీ-ది అన్సంగ్ వారియర్’ ప్రమోషన్ తర్వాత ఇంతవరకు అజయ్ దేవ్‌గన్ ఢిల్లీ వెళ్ళలేదు. కాబట్టి ఢిల్లీ పబ్ వెలుపల అజయ్ గొడవకు దిగినది అంటున్న ప్రచారం అవుతున్న వీడియో నిరాధారమైనవి. అవాస్తవమైనది. 'మైదాన్' 'మేడే' మరియు 'గంగూబాయి కతియావాడి' చిత్రీకరణ కోసం అజయ్ దేవగన్ ముంబైలో ఉన్నారు. 14 నెలల్లో అతను ఢిల్లీలో అడుగుపెట్టలేదని గమనించగలరు. ఏదైనా పోస్ట్ చేసే ముందు దయచేసి క్రాస్ చెక్ చేసుకోవాలని మీడియా వారిని కోరుతున్నాము” అని అజయ్ దేవగన్ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.
ఇదిలావుండగా అజయ్ దేవగన్ 'ఆర్. ఆర్.ఆర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్ 2న అజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది.