27కేజీల బ‌రువు త‌గ్గిన స్టార్ హీరో

Update: 2021-11-22 09:40 GMT
కోలీవుడ్ హీరో శింబు కొన్నాళ్లుగా వివాదాల‌కు దూరంగా ఉంటూ ప్ర‌శాంతంగా కెరీర్ పైనే ఫోక‌స్ పెట్టి ముందుకెళుతున్నాడు. సోలో లైఫ్ నే సో బెట‌ర్ అంటూ ప్రేమాయ‌ణ‌లు..డేటింగ్ ల‌ను దూరం పెట్టి సినిమాలతో బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం శింబు లైనప్ చూస్తే న‌టుడిగా చాలా బిజీగానే ఉన్నాడు.

వ‌చ్చే ఏడాది వ‌రుస‌గా మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. త్వ‌ర‌లోనే లూప్ అనే సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా సినిమా కోసం ఎంతగా శ్ర‌మించాడో శింబు రివీల్ చేసాడు.

``సినిమా కోసం మూడేళ్ల నుంచి క‌ష్ట‌ప‌డుతున్నాను. అయితే ఒకానొక ద‌శ‌లో మాన‌సిక ఒత్తిడితో బ‌రువు పెరిగాను. ఇలా ఒత్తిడికి గురైతే మ‌రిన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ‌తాయ‌న‌ని రియ‌లైజ్ అయి ఆ ఒత్తిడిని అధిగ‌మించే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాను.

ముందుగా డైట్ విష‌యంలో మార్పులు తీసుకొచ్చాను. ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డి తినే మాంసాహ‌రం మానేసాను. ఆ త‌ర్వాత మ‌ద్యం తాగ‌డం మానేసాను. ఈ రెండు నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. అటుపై వ్యాయామంపైనా దృష్టి నిలిపాను. అలా నెమ్మ‌దిగా 27 కిలోలు బ‌రువు త‌గ్గాను` అని అన్నారు.

27 కిలోల బ‌రువు త‌గ్గ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఎంతో క‌మిట్ మెంట్ తో ఉండాలి. దిన‌చ‌ర్య‌ల్లో ఎన్నో మార్పులు తీసుకురావాలి. ఆ విష‌యంలో శింబు ఎంతో శ్ర‌ద్ద తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు శింబు చాలా స్లిమ్ గా హ్యాండ్ స‌మ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు.

ఇటీవ‌ల కాలంలో శింబు ఫోటోలు సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ గా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. శింబు ఓల్డ్ పిక్స్... కొత్త ఫోటోల‌ను ప‌క్క‌న ప‌క్క‌నే జ‌త చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనా నేప‌థ్య‌లో `క‌రోనా కుమార్` అనే ఓ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది.




Tags:    

Similar News