డిజిటల్ రాకతో ప్రపంచం గుప్పిట్లో చిక్కుతోంది. మారుమూలన దాగి ఉన్న ప్రతిభ సైతం ప్రపంచానికి పరిచయం అయిపోతోంది. ఎవరికి వారు యూట్యూబ్ చానెళ్లు.. ట్విట్టర్-ఫేస్ బుక్-ఇన్ స్టాగ్రమ్ వంటి చోట్ల తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే సామాన్య ప్రజలే ఇలా ఉంటే సెలబ్రిటీలు ఇంకెలా ఉండాలి? అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియా.. యూట్యూబ్ వంటి చోట్ల స్పీడ్ గానే ఉన్నారు. అంతేకాదు వారసులు సైతం ప్రస్తుతం డిజిటల్ ప్రచారం కోరుకుంటున్నారు. ఇంతకుముందులా ఇంట్లోనే దాగి ఉండాలి అన్న సిస్టమ్ ఇప్పుడు లేదు. ప్రచారం ముఖ్యం.. బయటి ప్రపంచానికి తెలియడం ఇంకా ఇంపార్టెంట్ గా మారింది. అది సరికొత్త బిజినెస్ ఐడియాలకు ఆదాయ మార్గాలకు దారి తీస్తోంది.
ఇక ఇప్పటికే మన స్టార్ హీరోల వారసులు డిజిటల్ వేదికలపై తమ ఉనికిని చాటుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. యూట్యూబ్ .. సోషల్ మీడియాల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. ఇంతకుముందు సూపర్ స్టార్ మహేష్ కుమార్తె సితార- దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి యూట్యూబ్ చానెల్ ప్రారంభించి క్యూట్ గా మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. యూట్యూబ్ వేదికపై ఫాలోవర్స్ పెరుగుతున్నారు. మహేష్ వారసులైన గౌతమ్ - సితార ఇద్దరూ సోషల్ మీడియా వేదికలపైనా ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. ఈ స్టార్ కిడ్స్ కి సంబంధించిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియా వేదికలపై వైరల్ అయిపోతున్నాయి.
ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ వారసులు ఇప్పుడు డిజిటల్ వేదికపైకి వస్తున్నారన్నది అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. అల్లు అయాన్.. అల్లు అర్హ.. ఈ ఇద్దరి సందడిని బన్ని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేస్తూనే ఉన్నారు. చిచ్చరపిడుగు అర్హ అయితే డాడ్ ని తాతను ఓ ఆటాడుకుంటుంటే ఆ ఫన్నీ వీడియోలు ఫ్యాన్స్ ని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇక మాస్టార్ ఆయాన్- బేబి అర్హ ఇద్దరూ యూట్యూబ్ వేదికపైకి వచ్చి సందడి చేస్తే ఇంకేమైనా ఉందా? మెగా ఫ్యాన్స్ లో అవి జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతాయి. అయితే ఈ చిన్నారులది ఇంకా లోకంపోకడ తెలియని వయసు. నెమ్మదిగా డిజిటల్ మాధ్యమాల్లో పాపులరయ్యే అవకాశం ఉంది. ఇక తాత అల్లు అరవింద్.. బాబాయ్ శిరీష్ ప్రస్తుతం ఓటీటీ వేదికను రెడీ చేస్తున్నారు. ఈ వేదికపై కొత్త ట్యాలెంటుకు అవకాశం ఇచ్చి వరుసగా వెబ్ సిరీస్ లు తీయనున్నారు. అందులో బన్ని వారసులు చిల్ట్రన్ సిరీస్ లలో నటించే ఛాన్సుంటుందని.. బాల నటులుగా ఎంట్రీ ఇచ్చే వీలుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటి నుంచే డిజిటల్ పరిచయం వీరికి ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇదే తరహాలో నేచురల్ స్టార్ నాని వారసులు.. ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ వారసులు.. అల్లరి నరేష్ .. కళ్యాణ్ రామ్ వారసులు.. మంచు విష్ణు వారసులు .. డిజిటల్ వేదికలపైనా సందడి చేసే వీలుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.