ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీ మూతబడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. కాకపోతే కొన్ని షరతులను నిబంధనలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ మరియు సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని జీవోలు జారీ చేసాయి. దీంతో షూటింగ్స్ ఆపేసుకున్న చిత్రాలు చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. షూటింగ్స్ కి అనుమతిస్తున్నా పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై చాలా రోజులు ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండున్నరగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అవడం వలన ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోయారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఇంకా డెసిషన్స్ తీసుకోకపోవడంతో మరికొన్ని నెలలు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు. దీంతో కొన్ని నెలల పాటు రెవెన్యూ నామమాత్రంగా ఉండబోతోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నిర్మాతలు విరివిగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసే పరిస్థితి కనిపించడం లేదు.
కాగా ప్రభుత్వం అనుమతులిచ్చి థియేటర్స్ రీ ఓపెన్ చేసినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని అంటున్నారు. దీంతో నిర్మాత పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అందువల్ల ఇప్పటి నుంచి నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేసే ఛాన్స్ ఉంది. సాధారణంగా సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం డైరెక్టర్స్, టెక్నీషియన్స్ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ కే కేటాయిస్తున్నారు. దీంతో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే వారి పారితోషకాల్లో కోతలు విధిస్తే నిర్మాత అంతో ఇంతో కోలుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ కి చెందిన కొంత మంది హీరోలు, డైరెక్టర్లు స్వచ్ఛందంగా పారితోషికాలను తగ్గించుకుంటున్నారు. తమిళ హీరోలు డైరెక్టర్ల లాగే మన స్టార్ హీరోలు డైరెక్టర్లు టెక్నిషియన్స్ వారి రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ లో సగం సేవ్ అయినట్లేనని.. నిర్మాతలు కొంతమేర బయటపడే అవకాశాలుంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా వల్ల నష్టపోయిన నిర్మాతలకు అండగా ఉండటానికి మన టాలీవుడ్ హీరోలు డైరెక్టర్స్ టెక్నీషియన్స్ తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోడానికి రెడీగా ఉన్నారట. కాకపోతే రెమ్యూనరేషన్ తక్కువ తీసుకోవడంతో సినిమా లాభాల్లో వాటా అడుగుతున్నారట. ఎంతైనా మన టాలీవుడ్ లో చాలా వరకు అందరూ కమర్షియల్ అనే కోణం లోనే ఆలోచిస్తారు అనే టాక్ ఉంది. ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిర్మాతలకు మేలు చేయడం కోసం రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటాం అంటూనే రెవిన్యూలో వాటా కావాలని అడుగుతుండటంతో మనవాళ్ళు కమర్షియాలిటీ మరోసారి బయటపడిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.