ఇంకా చీప్ వ‌స్తువులే కొంటున్న స్టార్ హీరోయిన్

Update: 2022-09-14 02:30 GMT
కోట్ల‌లో పారితోషికం అందుకుంటున్నా ఇంకా మ‌ధ్య‌త‌ర‌గ‌తి బుద్ధులు త‌న‌ని వ‌దిలి పోలేద‌ని అంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాజ‌భోగం అనుభ‌వించిన ర‌కుల్ ఇప్ప‌టికే భారీగా అస్సెట్స్ వెన‌కేసుకుంది. దీపం ఉండ‌గానే వ్యాపార‌క‌లాపాల్ని కూడా చ‌క్క‌దిద్దుకున్న ఈ అమ్మ‌డు యూత్ లో ఎంతో క్రేజ్ ఉండే జిమ్ బిజినెస్ ని కూడా ఎస్టాబ్లిస్ చేసింది.

ఇటీవ‌లే ప్ర‌ముఖ నిర్మాత కం హీరో జాకీ భ‌గ్నానీతో డేటింగ్ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టింది. త‌న‌కు లైఫ్ ప‌రంగా కావాల్సినంత‌ భరోసా ఉంది. ఆదాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య అస‌లే లేదు.  కానీ ఈ అమ్మ‌డు త‌న పాత‌రోజుల‌ను అస్స‌లు మ‌ర్చిపోవ‌డం లేద‌ట‌. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి అటుపై క‌థానాయిక అయ్యేందుకు ప‌డిన క‌ష్టాల‌ను కూడా ర‌కుల్ మ‌ర్చిపోలేక‌పోతోంది.

త‌న కెరీర్ కి వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ అనే హిట్ సినిమా లేక‌పోయి ఉంటే ప‌రిస్థితి ఏమ‌య్యేదో. అప్ప‌టికే ఫ్లాప్ సినిమాలో న‌టించింది. అంత‌కుముందు త‌న‌కంటూ గుర్తింపు లేదు. ఐశ్వ‌ర్యం కూడా లేదు. కానీ వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టాక వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లోనూ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఎన్టీఆర్ - మ‌హేష్‌- చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించేసింది.

అయితే తాను ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఇప్ప‌టికీ ఒక మధ్య‌త‌ర‌గ‌తి యువ‌తిగానే ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని ర‌కుల్ అంది. తాను ఎప్ప‌టికీ కాస్ట్ లీ వ‌స్తువులు బ్రాండెడ్ వే కావాల‌ని కోరుకోదు. చీప్ కాస్ట్ లో త‌న‌కు న‌చ్చిన‌వి కొనుక్కుంటుంద‌ట‌. నిజ‌మే .. మ‌నిషి ఎంత ఎదిగినా మూలాల్ని మ‌ర్చిపోకూడదు. ఓవ‌ర్ నైట్ లోనే అంతా మారిపోతుంది. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి.. బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి! ర‌కుల్ ఆలోచ‌నా విధానం బాగానే ఉంద‌ని అనుకోవాలి. ప్ర‌స్తుతం ర‌కుల్ కెరీర్ సౌత్ లో ఆశించిన రేంజులో లేదు. అదే క్ర‌మంలో హిందీ ప‌రిశ్ర‌మ‌లో కెరీర్ బండిని లాగించేందుకు ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌ల‌ ర‌కుల్ `మషూకా` సాంగ్ లో త‌న‌వైన స్టెప్పుల‌తో అలరించింది. ఈ వీడియో హిందీలో విడుదలైంది.  తనిష్క్ బాగ్చి సంగీతం అందించిన ఈ ఆల్బ‌మ్ తెలుగు- తమిళ భాషల్లోను విడుద‌లైంది. అజయ్ దేవగన్ స‌ర‌స‌న న‌టించిన‌ `రన్ వే 34` ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. త‌దుప‌రి చత్రివాలి స‌హా ప‌లు చిత్రాల‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే న‌టుడు నిర్మాత జాకీ భ‌గ్నానీతో డేటింగ్ ని ఖ‌రారు చేసాక అత‌డు నిర్మిస్తున్న సినిమాల్లోనూ ర‌కుల్ న‌టిస్తోంది. అర్జున్ కపూర్ - భూమి పెడ్నేకర్ జోడీ ది లేడీ కిల్లర్స్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. `మేరీ పత్నీ కా రీమేక్` అనే తాత్కాలిక టైటిల్ వైర‌ల్ అవుతోంది.  `హ్యాపీ భాగ్ జాయేగీ` దర్శకుడు ముదస్సర్ అజీజ్ మొదటిసారిగా అర్జున్- ర‌కుల్ బృందంతో ప‌ని చేస్తున్నారు. ఇది క్రేజీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని చిత్ర‌బృందం తెలిపింది.

ఇంత‌కుముందు`సర్దార్ కా గ్రాండ్ సన్` లో అర్జున్ కి ప్రియురాలిగా ర‌కుల్ న‌టించింది.  తాజా చిత్రం 90ల నాటి గోవిందా కామెడీ నాస్టాల్జిక్ మెమరీగా రూపొందుతుండ‌గా ర‌కుల్ కి మ‌ళ్లీ అర్జున్ స‌ర‌స‌న మ‌రో  ఛాన్స్ ద‌క్కింది. పూజా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వాసు భగ్నాని నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. నిర్మాత జాకీ భ‌గ్నానీ సొంత బ్యాన‌ర్ సినిమాల‌కు క‌మిట‌వుతోంది. డాక్ట‌ర్ జి- అయ‌లాన్- థాంక్ గాడ్- భార‌తీయుడు 2 - ఛ‌త్రివాలి చిత్రాలు విడుద‌ల‌కు రావాల్సి ఉంది. `31 అక్టోబ‌ర్ లేడీస్ నైట్` అనే ద్విభాషా చిత్రంలోనూ ర‌కుల్ న‌టిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News