కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న హీరోయిన్లు

Update: 2020-04-11 03:45 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది. అక్కడెక్కడో చైనాలో చైనావోడు గబ్బిలం తిని తుమ్మితే.. ఇప్పుడు ఇక్కడ మనం చేతులు కడుక్కుంటున్న దుస్థితి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా దేశంలో ఉద్యోగ - ఉపాధి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూలీలు - పేదలు తినడానికి తిండి లేక అష్టకష్టాలు పడుతున్నారు. పేదలే కాదు.. ఉద్యోగులు కూడా ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కరోనా తగ్గి లాక్ డౌన్ ఎత్తివేస్తే తప్ప పనులు మొదలైతేనే జనాల ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు.

అయితే కరోనా దెబ్బ సామాన్యులనే కాదు.. ఒకప్పుడు వెలుగు వెలిగి ఇప్పుడు పొట్టతిప్పలు కోసం టీవీ షోలు చేసుకుంటున్న నటీమణులు - పాత స్టార్ హీరోయిన్లపై కూడా పడింది. యాంకర్లు - పార్టిసిపెంట్స్ తోపాటు జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంపాదించుకుంటున్న తారామణులు కూడా ఇప్పుడు ఆదాయం లేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారట..

వెండితెరపై ఓ వెలుగు వెలిగి - ర‌కార‌కాల అవ‌స‌రాలు కోసం బుల్లి తెరకు వచ్చి - జీవితం లాగిస్తున్న చాలా మంది స్టార్ హీరోయిన్ల ప‌రిస్థితి ఇప్పుడు మ‌రీ దారుణంగా తయారైందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

 టీవీలో జ‌డ్జీలుగా క‌నిపించే చాలా మంది స్టార్ హీరోయిన్స్ కి ఇప్పుడు లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్స్ లేక తెగ ఆర్ధిక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లుగా తెలిసింది. త‌ర్వ‌గా ఈ కరోనా రోగం త‌గ్గి మ‌ళ్లీ షూటింగ్స్ మొద‌లైతే త‌ప్ప వీరి బాధ త‌గ్గే ఛాన్స్ లేదట..

పెద్దగా సంపాదించుకోని తారలంతా ఇప్పుడు బుల్లితెరపై ఆధారపడి బతుకుతున్నారు.. జడ్జీలుగా పార్టిసిపెంట్స్ గా.. టీవీ సీరియళ్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు అన్నీ ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడుతున్నారు. త్వరగా కరోనా తగ్గి మళ్లీ షోలు ప్రారంభమయితేనే ఉపాధి అని.. కరోనా తగ్గించు దేవుడా అని వేడుకుంటున్నారట.. ఇలా కరోనా ఎఫెక్ట్ సామాన్యులనే కాదు.. సెలెబ్రెటీలపై కూడా పడిందంటున్నారు.


Tags:    

Similar News