ఐఎండీబీ రేటింగ్ పై స్టార్ మేక‌ర్ కి చిర్రెత్తికొచ్చింది!

Update: 2022-03-15 10:35 GMT
ఇటీవ‌ల విడుద‌లైన బాలీవుడ్ చిత్రం `ది కాశ్మీరి ఫైల్స్` దేశ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో చెప్పాల్సిన ప‌నిలేదు. 1990 వ‌ల‌స‌ల నేప‌థ్యంలో కాశ్మీరీ పండిట్ల‌పై జ‌రిగిన దురాగతాల‌కు ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి అద్భుత‌మైన దృశ్య‌రూపం ఇచ్చారు. సినిమా ఆద్యంత ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల దిశ‌గా దూసుకుపోతుంది. సినిమాలో ప్ర‌తీ పాత్ర‌ని అద్భుతంగా విష్క‌రించారు. పాత్ర‌ల మ‌ధ్య ఎమోష‌న్ సినిమాకి ప్ర‌ధాన అస్సెట్ గా నిలిచింది. విమ‌ర్శ‌కులు సైతం మెచ్చిన‌ గొప్ప చిత్రంగా నిలిచింది.  

అసాధార‌ణ‌మైన రివ్యూలు ద‌క్కాయి. `మిష‌న్ కాశ్మీర్`..`ది తాష్కెంట్ ఫైల్స్`..`ల‌మ్లా`..`షీన్` లాంటి చిత్రాల స‌ర‌స‌న `ది కాశ్మీర్ ఫైల్స్` నిలుస్తుంది.  అయితే ఈ సినిమాకి ఐఎండీబీ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

 ముందుగా ఈచిత్రానికి ఐఎండీబీ 10 కి 10 రేటింగ్ ఇచ్చింది. అయితే ఆ త‌ర్వాత ఆ రేటింగ్ ని 8.3గా స‌వ‌రించింది. దీంతో ది కాశ్మీరి ఫైల్స్ ఫ్యాన్స్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. రేటింగ్ని ఎందుకు త‌గ్గించాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

దీనికి సంబంధించి ఐఎండీబీ చేసిన ట్వీట్ సైతం వివాదాస్ప‌దంగా మారుతోంది. ``135000 మంది ఓటింగ్ చేయ‌గా అందులో 94 శాతం  మంది 10 కి 10..మిగిలిన వారు 1 సింగిల్ రేటింగ్ ఇచ్చారు. అలా యావ‌రేజ్ గా 8.3 గా ఐఎండీబీ రేటింగ్ని చివ‌రిగా కుదించింది.

మా రేటింగ్స్  మెకానిజం ఈ టైటిల్స్ పై అసాధార‌ణ ఓటింగ్ కార్య‌చ‌ర‌ణ‌ని గుర్తించింది. రేటింగ్ సిస్ట‌మ్ విశ్వ‌శ‌నీయ‌త కాపాడుటానికి..ప్ర‌త్యామ్నాయ వెయింటింగ్ గ‌ణ‌న ఈ మూవీకి అనువ‌దిస్తున్నాం. కానీ వివేక్ అగ్నిహోత్రి కావాల‌నే రేటింగ్ ని ప్ర‌భావితం చేస్తున్నార‌ని ఐఎండీపీ పేర్కొంది.

అన్ని ఓట్ల‌ని తీసుకున్న‌ప్ప‌టికి వాటిలో విలువైన వాటికే ప్రాధాన్య‌త ఇస్తాం. ఓటింగ్ లో విశ్వ‌స‌నీయ‌త చూస్తాం. ఓటింగ్ ఎలా వ‌చ్చిన‌ప్ప‌టికీ మా సిస్టం ప్ర‌కారం రేటింగ్ ఇస్తాం. ఆ సిస్టం ఏంట‌న్న‌ది బ‌య‌ట‌కు చెప్ప‌డం కుద‌ర‌దు`` అని తెలిపింది.

దీనికి బ‌ధులుగా వివేక్ ఇది అనైతికం అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. రేటింగ్ ముందు ఎక్కువ ఇచ్చి త‌ర్వాత త‌గ్గించ‌డంతోనే ఇక్క‌డ స‌మస్య త‌లెత్తింది. అదే రేటింగ్ ముందే త‌క్కువ ఇచ్చి ప‌బ్లిష్ చేసి ఉంటే ఈ స‌మ‌స్య త‌లేత్తేది కాద‌ని  తెలుస్తోంది.

అయితే ఇలా రేటింగ్ చేంజ్ అనేది సినిమాపై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్-అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో మిథున్ చ‌క్ర‌బొర్తి..అనుప‌మ్ ఖేర్..ద‌ర్శ‌న్ కుమార్..ప‌ల్లవి జోషి..చిన్మ‌య్ మండేల్క‌ర్..పునీత్ ఇస్సార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

    
    
    

Tags:    

Similar News