డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ కొత్త దర్శకులకు అవకాశాలిచ్చి ప్రయోగాలు చేయడం ఫెయిలవ్వడం ఇటీవల చర్చనీయాంశమైంది. సాహో - రాధేశ్యామ్ ఫలితాలు ప్రభాస్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ రెండిటికీ 'వన్ ఫిలిం డైరెక్టర్స్' కెప్లెన్సీ వహించారు. కానీ అంచనాల్ని తలకిందులు చేశారు.
అలాంటి తప్పిదాలు చేసేందుకు ఇతర స్టార్ హీరోలు ఎవరూ సిద్ధంగా లేరని తాజా పరిణామాలు చెబుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ కానీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కానీ.. అందుకు సిద్ధంగా లేరు. అల్లు అర్జున్ .. చరణ్.. ఎన్టీఆర్ సైతం ప్రయోగాలకు సిద్ధంగా లేరు. పైగా పాన్ ఇండియా స్టార్ డమ్ ని అందిపుచ్చుకునే క్రమంలో నేటితరంతో ప్రయోగాలు చేసే ధైర్యం చేయడం లేదు వీరంతా. అందువల్ల పదుల సంఖ్యలో నవతరం దర్శకులకు అవకాశాలు రాలేదని టాక్ వినిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ అస్సలు కొత్త వాళ్లతో ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు. సీనియర్ డైరెక్టర్లు అయినా కానీ కథ- బౌండ్ స్క్రిప్టుతో తనని మెప్పించాల్సిందే. సుకుమార్ లాంటి దర్శకుడికే 1-నేనొక్కడినే తర్వాత అతడు మరో ఛాన్సివ్వలేదు. 'సర్కార్ వారి పాట'కు గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన పరశురామ్ కి ఛాన్సిచ్చారు. త్రివిక్రమ్- రాజమౌళి.. లాంటి టాప్ డైరెక్టర్లతో మాత్రమే ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కొత్త దర్శకులు కథలు వినిపించినా కానీ మెప్పించలేకపోయారని తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం రాజమౌళి- కొరటాల- త్రివిక్రమ్ అంటూ పెద్ద దర్శకులకే అవకాశాలిస్తున్నారు. రామ్ చరణ్ ఏకంగా రాజమౌళి తరవాత శంకర్ తో కలిసి పని చేస్తున్నారు. కొరటాలతోనూ పని చేసారు. మధ్యలో జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరికి అవకాశం ఇవ్వడం ఆసక్తికరం. ఇకపోతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిరంతరం త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తూ బంపర్ హిట్లకు అలవాటు పడ్డాడు. అందువల్ల ఒక కొత్త దర్శకుడు తనకు కథ చెప్పినా కానీ అంత సులువుగా ఎక్కడం లేదు. మారుతి సహా పలువురికి ఈ అనుభవం అయ్యింది. వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమాని ప్రకటించి మరీ పెండింగులో పెట్టారు. వెంకీ కుడుముల లాంటి నవతరం డైరెక్టర్ వరుసగా పెద్ద హీరోలను మెప్పించే ప్రయత్నంలో సఫలమవుతున్నారు.
మరోవైపు కేజీఎఫ్ - చాప్టర్ 1 .. చాప్టర్ 2 చిత్రాలతో సంచలనంగా మారిన ప్రశాంత్ నీల్ వెంట పడుతున్నారు పై హీరోలంతా. ఇప్పటికే ప్రభాస్ సలార్ తో అవకాశం ఇచ్చాడు. తదుపరి మరో సినిమా కూడా ప్రభాస్ తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ ని ఇప్పటికే లాక్ చేశాడు.
ఇంతలోనే కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ - చిరంజీవిల భేటీ సంచలనమైంది. అలాగే బన్నీ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. అయితే ప్రశాంత్ నీల్ కూడా కొత్తతరం దర్శకుడు. తీసినవి తక్కువ సినిమాలే. ఉగ్రం -అగస్త్య లాంటి చిత్రాలు తీసారు. ఆ వెంటనే కేజీఎఫ్ తో బంపర్ హిట్ కొట్టారు. కానీ పరిశ్రమలో ఆయనకు సుదీర్ఘ కాలం అనుభవం ఉంది. ఇటీవల పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న అతడితో పని చేయడం సరైనది అని అగ్ర హీరోలంతా భావిస్తున్నారు.