సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇద్దరూ క్రేజీ హీరోలుగా మారారు..!

Update: 2021-03-17 00:30 GMT
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో  చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండ మరియు నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నారు. నిజ జీవితంలో కూడా ఫ్రెండ్స్ అయిన వీరిద్దరి కెరీర్ దాదాపుగా ఒకేలా కొనసాగిందని చెప్పవచ్చు. 'నువ్విలా' అనే సినిమాతో తొలిసారి స్క్రీన్ పై కనిపించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత నవీన్ తో కలిసి 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో కనిపించాడు. ఇక 'పెళ్లిచూపులు' సినిమాతో సోలో హీరోగా నటించి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఇక 'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టడంతో పాటు క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలో 'గీత గోవిందం' 'ట్యాక్సీవాలా' వంటి కమర్షియల్ హిట్స్ అందుకున్న విజయ్.. ఇప్పుడు 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేసే రేంజ్ కి వెళ్ళిపోయాడు.

ఇక నవీన్ పోలిశెట్టి విషయానికొస్తే లండన్ లో జాబ్ వదిలేసి మరీ థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' 'డీ ఫర్ దోపిడీ' '1-నేనొక్కడినే' వంటి సినిమాలో చిన్న పాత్రల్లో నటించిన నవీన్.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా మారి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత 'చిచోరె' సినిమాతో బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'జాతిరత్నాలు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. దీంతో నవీన్ పోలిశెట్టిని మరో విజయ్ దేవరకొండతో పోలుస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఎలాంటి సపోర్ట్ లేకుండా తమ టాలెంట్ ని నమ్ముకుని వచ్చి ఇప్పుడు టాలీవుడ్ లో తమకంటూ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకున్నారు. సక్సెస్ రావడానికి కాస్త సమయం పట్టొచ్చు.. కష్టపడితే ఏదొక రోజు కచ్చితంగా విజయం వరిస్తుందని నిరూపించారు.
Tags:    

Similar News