డ్యాన్స్‌ బేబీ కాదు.. సింగ్‌ బాబూ

Update: 2015-06-30 13:36 GMT
రారా రారా రమ్మంటుంటే... పోరా పోవే పొమ్మంటుంటే.. అంటూ స్టైల్‌లో ఇరగదీశారు ప్రభుదేవా, లారెన్స్‌ అండ్‌ టీమ్‌. ఆ సినిమాకి ఇన్‌స్పిరేషన్‌ హాలీవుడ్‌లో వచ్చిన స్టెపప్‌ సిరీస్‌. అదే స్టయిల్‌లో బాలీవుడ్‌లోనూ ఎబిసిడి తెరకెక్కింది అప్పట్లో. ఇటీవలే బాలీవుడ్‌లో ఎబిసిడి 2 రిలీజై 100 కోట్ల వసూలు చేసేస్తోంది.అయితే ఇదంతా డ్యాన్స్‌కి సంబంధించిన వ్యవహారం.

మన టాలీవుడ్‌లో డ్యాన్సింగ్‌ స్టార్స్‌ అంతా కలిసి ఒక స్టెపప్‌ లాంటి సినిమా తీస్తారనుకుంటే మన హీరోలు మాత్రం డ్యాన్స్‌ అన్న మాటే ఎత్తకుండా సింగింగ్‌ వైపు మొగ్గు చూపించారు. అప్పట్లో మెగాస్టార్‌ చిరంజీవితో మొదలైన ఈ ఫీవర్‌ ఇప్పటికీ కుర్రహీరోల్లోనూ రాజుకుంటూనే ఉంది. ఏ ఛాయ్‌.. తాగరా భాయ్‌ అంటూ మృగరాజులో చిరు పాటేసుకున్నాడు. ఆ తర్వాత పవన్‌ తన సినిమాల్లో చిన్న బిట్‌ సాంగ్‌ అయినా పాడాడు. అది మెగాభిమానుల్లో బాగా పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాతి కాలంలో చరణ్‌, బన్ని, మహేష్‌, ప్రభాస్‌ ఈ బాటలో వెళ్లలేదు కానీ నందమూరి హీరో ఎన్టీఆర్‌ తన సినిమాకి తను పాడుకున్నాడు. మంచు మనోజ్‌ పాడాడు. లక్ష్మీ ప్రసన్న ఇటీవలే 'దొంగాట' చిత్రంలో పాట పాడి మెప్పించింది.

ఇప్పుడొస్తున్న నవతరం నాయికలు చాలామంది తమ సినిమాల్లో తామే పాడేసుకుంటున్నారు. ఇలా నటీనటులంతా తమకంటే ముందు పాడిన వాళ్లను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని పాట పాడి మైమరిపిస్తున్నారు. ఈ పాట వల్ల సినిమాకి హైప్‌ కూడా పెరుగుతోంది. ప్రతి కొత్త ప్రయత్నం సినిమాకి కలిసొచ్చేదే. టాలీవుడ్‌లో ఇదో నయా ట్రెండ్‌.

Tags:    

Similar News