పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా రీమేక్ అయిన ఈ మూవీ సెకండ్ వేవ్ లోనూ మంచి ఆదరణ సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే ఊపులో పవర్ స్టార్ మరో రీమేక్ ని పట్టాలెక్కించారు.
అదే 'భీమ్లానాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు.
ఈ మూవీలో రానా కీలక పాత్రలో కనిపించాడు.ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే దీనికి ముందు మొదలు పెట్టిన 'హరి హర వీరమల్లు' షూటింగ్ మాత్రం ముందుకు వెళ్లడం లేదు.
జనసేన పార్టీ రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కల్యాణ్ త్వరలో అంటే అక్టోబర్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అంతటా ప్రత్యేక బస్ యాత్ర చేపట్టబోతున్నారు. ప్రత్యేకంగా కొన్ని రోజుల పాటు ఏపీ మొత్తం తిరగబోతున్నారు.
దీంతో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడబోతోంది. అయితే అక్టోబర్ బరకు సెట్స్ పై వున్న సినిమాల నిర్మాణం పూర్తి చేయాలన్నది పవన్ ప్లాన్. ఆ సమయానికే క్రిష్ డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ మూవీ 'హరి హర వీరమల్లు' షూటింగ్ తో పాటు కొత్త గా ప్రారంభించిన మరో రీమేక్ ని కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంత వరకు ఏ మూవీ షూటింగ్ ని కూడా ప్రారంభించలేదని తెలుస్తోంది. 'హరి హరి వీరమల్లు' షూటింగ్ విషయంలో ఇప్పటికీ కన్ఫ్యూజన్ రన్నవుతున్నట్టుగా చెబుతున్నారు.
ఇక రీసెంట్ గా తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన 'వినోదాయ సితం' ని తెలుగులో సముద్రఖని డైరెక్షన్ లోనే లాంఛనంగా ప్రారంభించారని వార్తలు వినిపించాయి. సాయిధరహ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పవన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీని కూడా అక్టోబర్ కి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇది కూడా పెండింగ్ లోనే వుందని, ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ ఏంటీ భీమ్లా? అని వాపోతున్నారట.