ఫోటో స్టొరీ: టవలే.. ఇంకేం లేదు

Update: 2019-03-15 06:01 GMT
హాట్ అంటే తక్కువ బట్టలు వేసుకోవడం అని చాలామంది  అనుకుంటారు కానీ అది నిజం కాదు.  అలా అయితే మినిమం డ్రెస్ తో దర్శనమిచ్చిన వారు ఎవరైనా హాటుగా కనిపించాలి కదా?  హాట్ గా కనిపించాలంటే బేసిక్ రిక్వైర్ మెంట్ ఏంటంటే ఒంటి తీరు సరిగ్గా ఉండడం. ఆ తర్వాతే బట్టలు మ్యాగ్జిమం అయినా.. మినిమం అయినా.  నడుము కనుక నలబై ఇంచులు ఉంటే ఎలాంటి సుందరినైనా చూడలేక చచ్చిపోతారు జనాలు.  అందుకనే ఈ జెనరేషన్లో బ్యూటీలందరూ ఫిట్నెస్ పై ఫోకస్ చేసేది.  ఈషా గుప్తా కూడా టైపుబ్యూటీనే.

 2007 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ  సోషల్ మీడియాలో హీటు పెంచి నెటిజనులకు నిద్రలేకుండా చేయడంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకుంది.  అప్పట్లో ఒకసారి ఈ బ్యూటీ దానిమ్మ పండును రెండు గా చేసి ఆ రెండు భాగాలను తన పై భాగానికి ఆచ్చాదనగా పెట్టుకుంది. ఇక సెమీ న్యూడ్ ఫోటో షూట్ లకు లెక్కే లేదు.  తరచుగా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజనులను ఆనందరపరిచే ఈ సుందరి తాజాగా టవల్ సీరీస్ ఫోటోలు పోస్ట్ చేసింది.  

ఈ ఫోటోలకు డ్రెస్ ఏమీ అవసరం లేకుండా ఒక టవల్ ను మాత్రం ఒంటి చుట్టూ చీర కొంగులా కప్పుకుంది.  ఎంత జాగ్రత్తగా ఆ పని చేసిందంటే.. నెటిజనులకు తన క్లీవేజ్ వ్యూ ఏమాత్రం మిస్ కాకుండా జాగ్రత్త తీసుకుంది.  ఇక ఈ ఫోటోలో మరో హైలైట్ ఏంటంటే కళ్ళ మేకప్.  చాలామంది నెటిజనులకు ఈ గ్రీన్ కలర్ కళ్ళ మేకప్ తెగ నచ్చింది.  ఈషాపై ప్రశంసలు కురిపించారు.  ఒక నెటిజనుడు గ్రీకు సుందరిలా ఉన్నావని మెచ్చుకున్నాడు.  ఈషా అందాల ఆరబోతలు కామనే.. జనాలు ఆగమాగం కావడం కూడా ఖాయమే.  ఈ బ్యూటీకి చేతిలో సినిమాలు కూడా ఫుల్లుగానే ఉన్నాయి.  'హేరా ఫేరీ 3'.. 'దేశి మ్యాజిక్' లాంటి క్రేజీ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.


Tags:    

Similar News