కొంతమంది నటులకు ఆ భాష ఈ భాష అని తేడా ఉండదు. పోకిరి పండు గాడు కొట్టినట్టుగా చితగ్గొడతారు. అలాంటి జాబితాలో కన్నడ హీరో సుదీప్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. కన్నడలో పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఏమాత్రం మొహమాటం లేకుండా పొరుగు భాషల్లో వచ్చే మంచి పాత్రలను వదిలిపెట్టకుండా యాక్సెప్ట్ చేస్తాడు. అంతటితో ఊరుకోడు.. వాటి తాట తీస్తాడు. అందుకే సుదీప్ కు సౌత్ అంతా మంచి గుర్తింపు ఉంది. తాజాగా సుదీప్ సల్మాన్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సల్మాన్ అయితే నాకేంటి.. ముంబై వెళ్లి మరీ ఫైట్ చేస్తా అంటున్నాడు.. నిజంగా కాదు లెండి.. సల్మాన్ కొత్త సినిమా కోసం!
సల్మాన్ గతంలో 'దబాంగ్' అనే సూపర్ హిట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ గా సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ దర్శకత్వంలో 'దబాంగ్-2' అనే సీక్వెల్ కూడా వచ్చింది కానీ ఎందుకో అది ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయింది. ఇపుడు ఈ సిరీస్ లోనే 'దబాంగ్-3' ని తెరకెక్కించేందుకు రంగం సిద్దమయిందట. ఈ సినిమాకు దర్శకుడిగా ప్రభుదేవాను ఎన్నుకున్నారట. సల్మాన్ ను డైరెక్ట్ చేయడం ప్రభుదేవాకు ఇది కొత్తేమీ కాదు. గతంలో ప్రభుదేవా 'వాంటెడ్' లాంటి సూపర్ హిట్ సినిమాను సల్మాన్ కు అందించాడు. దీంతో ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సల్మాన్ కు మెయిన్ విలన్ గా సుదీప్ ను తీసుకున్నారట.
సుదీప్ కు బాలీవుడ్లో ఇదేమీ మొదటి సినిమా కాదు. ఇప్పటికే వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఫూంక్' .. 'రక్త చరిత్ర' సినిమాల్లో నటించాడు. కాబట్టి మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోవడం ఖాయం. హీరోల కు రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.. విలన్స్ కు కాదు. కాబట్టి మళ్ళీ సుదీప్ తనలోని టాలెంట్ ను బయటకు తీస్తాడు. ఒక వేళ సినిమా కనుక హిట్టయితే సుదీప్ బాలీవుడ్ పాలిట పెద్ద విలన్ గా మారటం ఖాయం.