నేను సలహాలు మాత్రమే తీసుకున్నా సాయం పొందలేదు

Update: 2020-09-09 12:30 GMT
సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడిగా సుధీర్‌ బాబు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. హీరోగా తడబడుతూ నిలబడుతూ వస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినా కూడా సుధీర్‌ బాబు సాలిడ్‌ కమర్షియల్‌ సక్సెస్‌ లు రెండు మూడు కూడా లేవు. అయితే సినిమా సినిమాకు తనను తాను మల్చుకుంటూ నటుడిగా మంచి పేరు దక్కించుకుంటూ తనను ఎన్నుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు సుధీర్‌ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా 'వి' సినిమాలో సుధీర్‌ బాబు నటనకు మరియు ఆయన ఫిజిక్‌ కు మంచి మార్కులు పడ్డాయి.

ఆ సినిమా ఫలితం పట్ల సుధీర్‌ బాబు చాలా సంతృప్తిగా ఉన్నాడట. తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో సుధీర్‌ బాబు మాట్లాడుతూ తన కుటుంబంలో ఉన్న హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి కారణంగానే ఇండస్ట్రీకి వచ్చాను. అందుకు మామయ్య కృష్ణ గారు బావ మహేష్‌ బాబులు నాకు సాయం చేయలేదు. నేను అసలు వారి నుండి సాయం తీసుకోవాలనుకోలేదు.

ఒక వేళ వారి నుండి నేను సాయం పొంది సినిమాల్లో రాణించినట్లయితే నేను కట్నం తీసుకున్నట్లు అవుతుంది. అందుకే నేను వారి నుండి ఎప్పుడు కూడా సాయం పొందలేదు. కేవలం సినిమాల్లో రాణించేందుకు గాను కృష్ణ మహేష్‌ బాబు గార్ల సలహాలు మాత్రమే తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎవరిపై ఆధారపడకుండానే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈ స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
Tags:    

Similar News