మహేష్‌ కు రూ.200 కోట్లు ఇచ్చినా ఆ పని చేయడు : సుధీర్‌ బాబు

Update: 2021-08-29 06:18 GMT
సుధీర్ బాబు నటించిన 'శ్రీదేవి సోడా సెంటర్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రివ్యూలు పాజిటివ్‌ గా వచ్చాయి. ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సినిమా విడుదల తర్వాత మహేష్ బాబు చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. తప్పకుండా చూడదగ్గ సినిమా అన్నట్లుగా ఆయన చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కొందరు సుధీర్‌ బాబు సినిమా ఎలా ఉన్నా కూడా ఆయన ట్వీట్‌ చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్‌ బాబు చేసిన ట్వీట్ వల్ల ఖచ్చితంగా సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అవ్వడంతో పాటు మరింతగా వసూళ్లు నమోదు అవుతున్నాయి అనడంలో సందేహం లేదు. సుధీర్ బాబు చేసిన సినిమాల్లో ఇది ఒక బెస్ట్‌ మూవీ అన్నట్లుగా మహేష్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమా సక్సెస్ మీట్‌ లో భాగంగా సుధీర్ బాబు మాట్లాడుతూ మహేష్‌ బాబు చేసిన ట్వీట్‌ గురించి స్పందించాడు. మహేష్‌ బాబు ట్వీట్‌ వల్ల సినిమాకు మంచి మైలేజ్ దక్కినట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇంకా సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహేష్‌ ను బెదిరించినా.. భయపెట్టినా.. రూ.200 కోట్లు ఇచ్చినా కూడా తనకు నచ్చితేనే ఏదైనా వస్తువు లేదా బ్రాండ్‌ ను ప్రమోట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఇష్టం లేని బ్రాండ్స్‌ కు ప్రమోషన్ చేయడు అంటూ సుధీర్ బాబు  వ్యాఖ్యలు చేశాడు. మహేష్‌ బాబుకు తమ సినిమా బాగా నచ్చడం వల్లే ప్రమోషన్ చేసేందుకు సిద్దం అయ్యాడు. శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమా పై మహేష్‌ చేసిన కామెంట్స్ ఆయన మనసు నుండి వచ్చాయి అన్నట్లుగా సుధీర్‌ బాబు అభిప్రాయం వ్యక్తం చేశాడు. మహేష్‌ బాబు తన ప్రతి సినిమాకు కూడా ప్రమోట్‌ చేసేందుకు సిద్దం అవ్వడు అని.. తనకు నచ్చిన సినిమా గురించి మాత్రమే స్పందిస్తాడు అన్నట్లుగా సుధీర్ బాబు పేర్కొన్నాడు.
Tags:    

Similar News