నటశేఖర కృష్ణ అల్లుడిగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుధీర్ బాబు. 'శివ మనసులో శృతి' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. 'ప్రేమ కథా చిత్రమ్' 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' 'భలే మంచి రోజు' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'భాగీ' సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సుధీర్.. విలన్ గా అక్కడా సత్తా చాటాడు. ఈ క్రమంలో 'శమంతకమణి' 'సమ్మోహనం' వంటి సూపర్ హిట్స్ అందుకొని.. గతేడాది 'వి' సినిమాతో అలరించాడు. ఇప్పుడు 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈరోజు శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. రివ్యూస్ యావరేజ్ గా ఉన్నా.. మంచి సినిమా అనే ఆడియన్స్ మౌత్ టాక్ తో థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో సుధీర్ బాబు పర్ఫామెన్స్ కు అప్పియరెన్స్ కు ఎక్కువ మార్కులు పడుతున్నాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ డ్రామాని ఎంచుకున్న సుధీర్.. లైటింగ్ సూరిబాబు పాత్రలో అదరగొట్టాడని ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు.
సూరిబాబు పాత్రలో జీవించిన సుధీర్ బాబు.. ఈ సినిమా కోసం తను ఎంత చేయాలో అంత చేసాడు. ఎమోషనల్ అండ్ యాక్టన్ సన్నివేశాలతో పాటుగా లవ్ సీన్స్ లో కూడా ఇరగదీశాడు. సిక్స్ ప్యాక్ కోసం అతను పడ్డ కష్టం ఏమాత్రం వృథా కాలేదు. గాయాలను సైతం లెక్క చేయకుండా డూప్ లేకుండా చేసిన బోటు సీక్వెన్స్ అభిమానులను అలరిస్తున్నాయి. సుధీర్ బాబు ఎలాంటి పాత్రలైనా చేయగలడని ఈ సినిమాతో మరోసారి నిరూపించాడు.
ఏదేమైనా సుధీర్ బాబు కు సినిమా మీద ఉన్న ఫ్యాషన్ డెడికేషన్ ని మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ.. ఇమేజ్ చిత్రంలో ఇరుక్కుపోకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. సినిమా సినిమాకి వెరీయేషన్ ఉండేలా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. స్క్రిప్టుని నమ్మి, దాని కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోడానికి సిద్ధంగా ఉంటున్నాడు.
'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న సుధీర్ బాబు.. తదుపరి చిత్రాలను డిఫరెంట్ జానర్స్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చేస్తున్నారు. అలానే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం క్రీడాకారుడిగా మారుతున్నాడు. ఇదే క్రమంలో హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా.. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే మరో సినిమాకి సుధీర్ బాబు కమిట్ అయ్యారు.