అక్కినేని నాగార్జున-నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవదాస్’ సినిమాను వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలని ముందు అనుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ సమయానికి సినిమాను రెడీ చేయడం కష్టమని భావించి వాయిదా వేసేశారు. మరి పండగ సీజన్లో ఇంకే పెద్ద సినిమా వస్తుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఐతే ప్రస్తుతానికి మరే పెద్ద సినిమా వినాయక చవితి మీద దృష్టిపెట్టలేదు. ఈలోపు సుధీర్ బాబు చవితిపై కర్చీఫ్ వేసేశాడు. ఇటీవలే ‘సమ్మోహనం’తో మంచి విజయాన్ని అతను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా నటుడిగా కూడా అతడికి మంచి పేరు తెచ్చింది. ఈ ఊపులో తన సొంత నిర్మాణ సంస్థ ‘సుధీర్ బాబు ప్రొడక్సన్స్’లో తొలిసారిగా చేస్తున్న ‘నన్ను దోచుకుందువటే’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు సుధీర్.
సెప్టెంబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట. 12న వరల్డ్ వైడ్ ప్రిమియర్లు కూడా ఉంటాయని ఘనంగా ఇప్పుడే ప్రకటన ఇచ్చేశాడు సుధీర్. ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. నభా నటేష్ కథానాయికగా పరిచయం కానుంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్ లాంచ్ చేశారు. అది సరదాగా సాగుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. సుధీర్ ఇందులో కార్పొరేట్ ఆఫీసులో పని చేసే చండశాసనుడైన ఒక మేనేజర్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ క్యారెక్టర్లో కనిపించనుంది. నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర చేశాడు. కన్నడలో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరి చవితి రోజు సుధీర్ బాబుకు నిర్మాతగా.. హీరోగా ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.