ఎక్స్ క్లూసివ్ : తుపాకీ డాట్ కామ్ తో డైరెక్టర్ సుధీర్ వర్మ స్పెషల్ చిట్ చాట్

Update: 2019-08-13 15:16 GMT
* మీ అభిమాన దర్శకుడు క్యూన్టిన్ టరంటినో సినిమా రిలీజ్ రోజునే మీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది - కావాలనే ఈ రోజు రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారా?

మీకు తెలిసో తెలియదో - నాకు తెలిసి మీకు తెలిసి ఉండకపోవచ్చు - నా మొదటి సినిమా స్వామి రారా కూడా క్యూన్టిన్ టరంటినో తీసిన జాంగో అంచైన్డ్ సినిమా రిలీజ్ రోజునే విడుదల అయింది - సూపర్ హిట్ ఐయింది - రణరంగం కి కూడా అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తుందని నమ్ముతున్నా - ఇక ఇలా క్యూన్టిన్ టరంటినో తీసిన సినిమా రిలీజ్ రోజునే నా సినిమా రిలీజ్ కూడా ఉండాలి అని నేను ప్లాన్ చేసి ఇదంతా చేయలేదు - నిజానికి మేం మేము ముందే రావాలి - కానీ సాహో వెనక్కి వెళ్లే టైం సరికి ఈ డేట్ మంచిదని రిలీజ్ ఇప్పుడు ప్లాన్ చేసాము. నా అభిమాన దర్శకుడి  ప్రభావం నా పైన ఉంటుంది కానీ ఇలా డేట్స్ మ్యాచ్ చేసుకొని రిలీజ్ చేసేంత లేదు.

* మీ పై క్యూన్టిన్ టరంటినో ప్రభావం ఉంటుందని మీరే చెప్పారు - రణరంగం లో ఆ ప్రభావం ఎంత వరకు ఉంది?

రణరంగం లోనే కాదు - నా ప్రతి సినిమాలో అయన ప్రభావం ఉంటుంది - ఐతే స్క్రీన్ ప్లే విషయం లోనే నేను కొన్ని సన్నివేశాలకు క్యూన్టిన్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటాను - స్వామి రారా లో జోగి బ్రదర్స్ ఎపిసోడ్ కానీ - కేశవ లో చాఫ్టర్స్ కానివ్వండి - ఇదంతా క్యూన్టిన్ స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్ నుండే నేను తీసుకున్నా ఐతే రణరంగం కథ కు క్యూన్టిన్ మేకింగ్ అడాప్ట్ చేయడం కష్టం అందుకే ఈ సినిమా ను స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ గా రూపొందించాను. గాడ్ ఫాదర్ 2 లో ఉన్న స్క్రీన్ ప్లే రణరంగం లో ఉన్నట్లు అనిపిస్తుంది, కొంచెం ఆ ప్రభావం ఐతే ఉంది.

* ఏది ఏమైనా మీ పై వరల్డ్ మూవీస్ ప్రభావం ఉంది అని ఒప్పుకుంటున్నారు?

అందులో మరో ఆలోచనలేదు - ఎవరైనా కథ రాయాలి అంటే - ఏదొక స్ఫూర్తి కావాలి - అలా నేను రాసుకునే కథలను - ఆడియన్స్ కి కొత్తగా చెప్పడానికి నేను వరల్డ్ మూవీస్ లో ఉన్న ఫేమస్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను - నేనే కాదు ఈ పద్దతిని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫాలో అవుతున్నారు - నేను ఓపెన్ అవుతాను వాళ్ళు అవ్వరు అంతే.

* కేశవ తరువాత రణరంగం కోసం ఇంత టైం ఎందుకు తీసుకున్నారు?

పడి పడి లేచాను మనసు లో హీరో లుక్ కి కంటిన్యూటీ మిస్ అవుతుందని - అది మొత్తం పూర్తి అయ్యాకే రణరంగం షూటింగ్ మొదలు పెట్టాము - దాదాపు నేను ఈ సినిమా కోసం 700 రోజులు పైగా టైం స్పెండ్ చేస్తే అందులో కేవలం 75 రోజులు మాత్రమే షూటింగ్ జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కోసం షూటింగ్ కంటే వెయిటింగ్ ఎక్కువగా చేసాము(navvulu)

* గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగిన మీరు - ఎందుకు ఈ వయిలెన్స్ నేపథ్యంలో సినిమాలు కంటిన్యూ గా చేస్తున్నారు, ఈ క్రైమ్ స్టోరీస్ మీ జీవితం లోకి ఎలా వచ్చాయి?

నిజానికి గోదావరి యాస - ఎటకారం నేపథ్యంలో సినిమా చేద్దాం అని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను - ఐతే సరైన కథ సెట్ అవ్వడం లేదు - కానీ గోదావరి నేపథ్యంలో ఒక సినిమా ఐతే కచ్చితంగా చేస్తాను. ఇక నేను క్రైమ్ - వయిలెన్స్ నేపథ్యంలో ఉన్న సినిమాలు నేను ఎక్కువుగా ఇష్టపడటం వలెనే నేను కూడా అలాంటి సినిమాలు తీస్తున్నా అని అనుకుంటున్నా - కనీసం కథ లో ఒక మర్డర్ ఐనా లేకపోతే నా పెన్ ముందుకు వెళ్లడం లేదు.

* రణరంగం లో వయిలెన్స్ ని యే రేంజ్ లో చూపిస్తున్నారు?

(నవ్వులు) వయిలెన్స్ అంటే రక్తం లో ఆడియన్స్ ని తడిసిపోయేంత - చూడటానికి ఇబ్బంది పడేలా నా సినిమాల్లో సన్నివేశాలు ఉండవు - చాలా నీట్ గా వయిలెన్స్ ని చూపించడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను - ఇక రణరంగం లో అదే ఫాలో అయ్యాను - ఆడియన్స్ ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ కి థ్రిల్ ఫీల్ అవ్వడం గ్యారంటీ.

* కొన్ను సీన్స్ కి మాత్రమే కాదు మీ రణరంగం మొత్తాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేయాలనీ మా తుపాకీ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది - అల్ ది బెస్ట్

(నవ్వులు) కొన్ని సీన్స్ అంటే నేను వయిలెన్స్ ఉన్న సీన్స్ గురించి చెడుబుతున్నా, రణరంగం సినిమా మొత్తం ప్రేక్షకులు ని అలరిసితోంది అని నేను నమ్ముతున్నా - థాంక్యూ


  


Tags:    

Similar News